News February 6, 2025
ప్రియాంక గాంధీని కలిసిన పెద్దపల్లి ఎంపీ
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, యువతకు ఉపాధి అవకాశాలు, ప్రత్యేక నిధుల కేటాయింపుల గురించి ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 6, 2025
పడుకునే ముందు ఈ పనులు చేస్తే..
రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు వ్యాయామం చేయడం మానుకోవాలి. దీని వల్ల శరీరం ఉత్తేజితమై నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాఫీ, చాక్లెట్లు తినకూడదు. వీటిలో ఉండే కెఫీన్ నిద్రలేమిని కలిగిస్తుంది. నిద్రించేముందు ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే నీరు కూడా ఎక్కువగా తాగకూడదు. రాత్రి వేళల్లో స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండాలి. పడుకునే ముందు ఫోన్‌ను వేరే గదిలో ఉంచడం బెటర్.
News February 6, 2025
ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్ సందీప్ కుమార్
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ కు SRCL కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా ఆర్థిక సాయం అందజేశారు. నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ లలిత దంపతుల పాప బుధవారం ప్రమాదవశాత్తు మరణించగా, బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద బుధవారం రాత్రి రూ.లక్ష అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా గురువారం మరో లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
News February 6, 2025
కోహ్లీ గాయం శ్రేయస్‌కు వరమైంది!
కోహ్లీ గాయపడటం వల్లే ENGతో తొలి వన్డేలో తనకు ఆడే అవకాశం వచ్చిందని శ్రేయస్ అయ్యర్ తెలిపారు. ‘మ్యాచులో ఆడట్లేదని తెలిసి నిన్న రాత్రి సినిమా చూద్దామని అనుకున్నా. అప్పుడే కెప్టెన్ నుంచి కాల్ వచ్చింది. కోహ్లీ మోకాలికి గాయమైందని, అతని స్థానంలో ఆడేందుకు సిద్ధంగా ఉండమని చెప్పారు. అందుకే తొందరగా నిద్రపోయా’ అని మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఈ మ్యాచులో శ్రేయస్ 36 బంతుల్లో 59 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.