News October 11, 2025
ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్యాయత్నం

ములకలచెరువు(M)నికి చెందిన ఓ యువకుడు ప్రియురాలు మోసం చేసిందని విషం తాగి తాగాడు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని బురకాయలకోటకు చెందిన గణేష్ స్థానికంగా ఉండే టోల్ గేట్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉండటమే కాకుండా పెళ్లికి నిరాకరించిందని ఆయన మనస్తాపం చెందాడు. ఆ బాధతో విషం తాగగా కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు.
Similar News
News October 11, 2025
మొదటిసారి మేకప్ వేసుకుంటున్నారా?

కొత్తగా మేకప్ ప్రయత్నించాలనుకొనే వారికోసం ఈ చిట్కాలు. ముందు మీ స్కిన్ టైప్ ఏంటో గుర్తించాలి. డ్రై, ఆయిలీ, నార్మల్ ఇలా..దాన్ని బట్టి కాస్మెటిక్స్ ఎంచుకోవాలి. ముందు ముఖానికి మాయిశ్చరైజర్ రాయాలి. తర్వాత ఫౌండేషన్. ఇది మీ చర్మటోన్, టెక్స్‌చర్‌కు సరిపోయేలా ఉండాలి. డార్క్‌సర్కిల్స్‌కు కన్సీలర్ వాడాలి. కళ్లకు ఐలైనర్, కనురెప్పలకు మస్కారా, పెదాలకు లిప్‌లైనర్, లిప్‌స్టిక్ వేసుకోవాలి. <<-se>>#BeautyTips<<>>
News October 11, 2025
విశాఖలో సిఫీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

మంత్రి నారా లోకేశ్ రేపు విశాఖ రానున్నారు. ఉదయం 9 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి రుషికొండకు వెళ్తారు. SIFY డేటా సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ నుంచి ఎన్‌టీఆర్ భవన్‌కు చేరుకొని ముఖ్య నేతలతో సమిక్షిస్తారు. సాయంత్రం మూడు గంటలకు మధురవాడ స్టేడియంకు వెళ్లి క్రికెట్ మ్యాచ్‌ను విక్షిస్తారు. రాత్రి 11:40కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని విజయవాడ వెళ్తారు.
News October 11, 2025
Colgate పేరుతో నకిలీ టూత్ పేస్టులు

ఇప్పటిదాకా కల్తీ పాలు, అల్లం పేస్టులు, ఆయిల్ ప్యాకెట్లు బయటపడగా తాజాగా నకిలీ టూత్ పేస్టులు కలకలం రేపుతున్నాయి. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో Colgate పేరుతో రెడీ చేసిన ఫేక్ టూత్ పేస్ట్ బాక్స్‌లు భారీగా బయటపడ్డాయి. చిత్రోడ్ ప్రాంతంలో పోలీసులు దాడులు చేసి వీటిని పట్టుకున్నారు. సుమారు రూ.9.43 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. దీని సప్లై చైన్ తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.