News January 22, 2026

ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్స్ అమ్మొద్దని వార్నింగ్

image

TG: మెడికల్ షాపుల ఓనర్లకు డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్ ఇచ్చింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్స్ విక్రయించవద్దని ఆదేశించింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా అలాంటి 190 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ వాడితే ‘యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్’ బారినపడతారని, ఇది ప్రాణాంతకం అని తెలిపింది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ అని స్పష్టం చేసింది.

Similar News

News February 11, 2026

జగమంతా శివతత్వం

image

శివతత్వం అంటే కేవలం ఒక రూపం మాత్రమే కాదు. అది అంతటా నిండి ఉన్న అనంతమైన చైతన్యం. సృష్టిలోని ప్రతి అణువులోనూ, ప్రకృతిలోని ప్రతి మార్పులోనూ శివుడు ఉన్నాడు. కనిపించే పర్వతాలు, ఆకాశం నుంచి మనలో కలిగే ఆలోచనలు, కలల వరకు అన్నీ ఆ శివమయమే. శివం కానిది ఈ విశ్వంలో ఏదీ లేదు. మన ఊహకు అందేదీ ఆయనే! ఆ ఊహ చేసేదీ ఆయనే! శివతత్వం అంటే మౌనం, శూన్యం, సమస్తం. జగమంతా శివతత్వమే.

News February 11, 2026

విశాఖలో IPL మ్యాచులు?

image

IPL–2026లో విశాఖ వేదిక ఉండనున్నట్లు తెలుస్తోంది. ACA–VDCA స్టేడియంలో కనీసం రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వేదికను హోం గ్రౌండ్‌గా ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక DCకి కలిసి రాగా ఈ ఏడాది కూడా మ్యాచుల నిర్వహణకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయమై ఆంధ్ర క్రికెట్ సంఘం DCని సంప్రదించగా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.

News February 11, 2026

ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయట

image

ఒడిశాలోని బింకా సమీపంలో మహానది తీరాన ఉన్న పాపాక్షయ ఘాట్‌కు 900 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రాహ్మణ హత్య దోషంతో బాధపడిన అనంగ భీమదేవుడు ఇక్కడ స్నానం చేసి విముక్తి పొందాడని కథనం. ఓ ఆవు స్వయంగా పాలిచ్చిన చోట రాజు కపిలేశ్వర శివాలయాన్ని నిర్మించాడు. ఇక్కడి మహానదిలో స్నానం చేసి, శివుడిని దర్శించుకుంటే పాపాలు తొలగి మనశ్శాంతి కలుగుతుందని విశ్వాసం. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఈ ఘాట్‌కు ఏటా ఎంతో మంది వస్తుంటారు.