News January 8, 2026
ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో తమిళనాడుతో ఏపీ ఫైట్

అండర్-14 బాలికల జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ఫ్రీ క్వార్టర్ ఫైనల్‌లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు గెలిస్తే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జట్టు సభ్యులు కచ్చితంగా విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కీలక మ్యాచ్ రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
Similar News
News February 4, 2026
లోక్‌సభలో మాంసం ధరలపై మాట్లాడిన MP అవినాశ్

లోక్‌సభలో మంగళవారం కడప MP అవినాశ్ రెడ్డి మాంసంపై ప్రశ్నలు లేవనెత్తారు. APలో నాటుకోడి ధరలు మటన్ కంటే ఎక్కువగా ఉన్నాయన్న విషయం ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. కేంద్రం పౌల్ట్రీ అభివృద్ధికి రోగ నియంత్రణ, బయో సెక్యూరిటీ, బీమా చర్యలు తీసుకుంటుందా అని అడిగారు. స్పందించిన కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి రాజీవ్ రంజన్ ఏపీలో నాటుకోడి మాంసం ధర కిలో రూ.500 ఉండగా మటన్ ధర దాదాపు రూ.900 ఉందని బదులిచ్చారు.
News February 3, 2026
కడప జిల్లాలో 15 మంది ఎస్సైల బదిలీ

కడప జిల్లాలో 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో బద్వేల్, వేంపల్లి, పోరుమామిళ్ల, పులివెందుల, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, సిద్దవటం తదితర స్టేషన్ల ఎస్సైలు ఉన్నారు. బదిలీ అయిన వారు వెంటనే కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
News February 3, 2026
కడప: జనవరి నెలలో ఎంత కరెంట్ కాల్చారంటే.!

కడప సర్కిల్ పరిధిలో జనవరి నెలలో 361.886 మిలియన్ యూనిట్లు (MU) విద్యుత్ వినియోగం జరిగింది. కడప డివిజన్లో 51.999, పులివెందుల డివిజన్లో 63.585, ప్రొద్దుటూరు డివిజన్లో 94.843, మైదుకూరు డివిజన్లో 61.638, రాజంపేట డివిజన్లో 50.168, రాయచోటి డివిజన్లో 39.653 MU విద్యుత్ వినియోగం జరిగింది. కడప సర్కిల్ జనవరి నెల విద్యుత్ కోటా 323.862 MU కాగా.. 361.886 MU వినియోగం జరిగింది.


