News January 8, 2026

ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో తమిళనాడుతో ఏపీ ఫైట్

image

అండర్-14 బాలికల జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ఫ్రీ క్వార్టర్ ఫైనల్‌లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు గెలిస్తే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జట్టు సభ్యులు కచ్చితంగా విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కీలక మ్యాచ్ రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.

Similar News

News January 28, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.17,100
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.15,732
* వెండి 10 గ్రాములు ధర రూ.3,730.

News January 28, 2026

ఖాజీపేట: ‘మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు’

image

ఖాజీపేట (M) బి.కొత్త పల్లె గ్రామానికి చెందిన ముత్తూర్ హృషి కేశవ రెడ్డి గ్రూప్ 2 (ఏఎస్ఓ జిఏడి)ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈయన గతంలో 2019-23 వరకు కూనవారి పల్లె గ్రామ సచివాలయ సెక్రెటరీగా, 2023లో బ్రహ్మంగారిమఠంలో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం గ్రూప్ -2 లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, (సాధారణ పరిపాలన శాఖ) ఉద్యోగం లభించింది. ఈయన మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం విశేషం.

News January 27, 2026

ప్రొద్దుటూరు: సీఐ శ్రీరామ్‌కు లూప్ లైన్ కొత్తేమీ కాదు.!

image

ప్రొద్దుటూరు 1టౌన్ సీఐ శ్రీరామ్ కు లూప్ లైన్ అనేది కొత్తేమీ కాదు. ప్రతి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ మధ్య ఆయన్ను లూప్ లైన్లో ఉంచారు. అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో VRలో పెట్టారు. అదే జిల్లాల్లో DCRBలోను ఉంచారు. కడప, తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ విభాగంలోను ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ బృందంలో కీలక అధికారిగా శ్రీరామ్ ఉన్నారు.