News February 7, 2026

ప్రీ డయాబెటీస్‌ని ఎలా గుర్తించాలంటే?

image

ప్రీ డ‌యాబెటిస్ అంటే డ‌యాబెటిస్‌కి ముందు స్టేజి. వీరిలో ర‌క్తంలో చక్కెర స్థాయిలు మ‌రీ అధికంగా ఉండ‌వు కానీ కాస్త ఎక్కువ‌గా ఉంటాయి. దీన్ని ప‌ట్టించుకోక‌పోతే డ‌యాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. వీరికి సాధార‌ణంగా వైద్యులు మందుల‌ను ఇవ్వ‌రు. కొన్నిరోజుల పాటు డైట్, వ్యాయామం చేయాల‌ని సూచిస్తారు. ప్రీ డయాబెటీస్ ఉన్న కొందరికి షుగర్ లక్షణాలుంటాయి. కానీ 35 ఏళ్లు దాటాక అందరూ షుగర్ టెస్టులు చేయించుకోవడం మంచిది.

Similar News

News February 19, 2026

పంటల్లో చెదపురుగుల నివారణకు మరికొన్ని సూచనలు

image

పొలం గట్లపై ఉండే చెదపురుగుల స్థావరాలను గుర్తించి నాశనం చేయాలి. సరిగా కుళ్లని సేంద్రియ ఎరువు చెదపురుగులను ఆకర్షిస్తుంది. అందుకే బాగా కుళ్లిన సేంద్రియ పదార్థాన్నే ఎరువుగా వాడాలి. పంట విత్తేసమయంలో KG విత్తనానికి క్లోరిపైరిఫాస్ 6ml కలిపి విత్తనశుద్ధి చేస్తే విత్తనాలను చెద నుంచి కాపాడవచ్చు. చెరకు పంటలో చెదల నివారణకు లీటరు నీటికి మలాథియాన్ 2mlను కలిపి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత మొక్క మొదల్లో వేయాలి.

News February 19, 2026

ధ్యానంతో దైవ దర్శనం సాధ్యమని చెప్పిన మహర్షి

image

ఉపనిషత్తుల్లో పేర్కొన్నవారిలో ఆరుణి మహర్షి ఒకరు. ఆయన గొప్ప జ్ఞాని. ఆయన బోధనలు బృహదారణ్యక, ఛాందోగ్య ఉపనిషత్తులలో కనిపిస్తాయి. ఆయన ఆధ్యాత్మిక గురువు. ఈయన వద్దే సుప్రసిద్ధ యాజ్ఞవల్క్య మహర్షి విద్యను అభ్యసించారు. ఆత్మ, శరీరం, అంతరాత్మతో దేవుడిని తెలుసుకోవచ్చని శిష్యులకు వివరించేవారు. తన కుమారుడైన శ్వేతకేతువుకు తత్త్వమసి వంటి ఆధ్యాత్మిక రహస్యాలను బోధించి, ధ్యానంతో దైవదర్శనం కలిగించారు.

News February 19, 2026

ESIC మెడికల్ కాలేజీ& హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

రాంచీలోని <>ESIC<<>> మెడికల్ కాలేజీ& హాస్పిటల్ 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు FEB 24వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MD/MS/DNB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు ప్రొఫెసర్‌కు రూ.1.23L, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.78,800, అసిస్టెంట్ ప్రొఫెసర్‌, సీనియర్ రెసిడెంట్‌కు రూ.67,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in