News February 21, 2026
ప్రీ మెచ్యూర్ బేబీలకు ఈ సమస్యల ముప్పు

నెలలు నిండక ముందే పుట్టినవారు చాలా సున్నితంగా ఉంటారు. కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. ముందే పుట్టడం వల్ల వీరికి కంటి సమస్యలు, వినికిడి లోపం, శ్వాస, మెదడు సమస్యలు, గుండె జబ్బులు, నరాలు, జీర్ణశయాంతర సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. పుట్టినప్పుడు వారి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.
Similar News
News February 23, 2026
కల్తీ పాల ఘటన.. 4కు చేరిన మరణాలు

AP: రాజమండ్రి కల్తీ పాల <<19213441>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 4కి చేరింది. వెంటిలేటర్‌పై 9 మందికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పాల వ్యాపారిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. బాధితుల రక్త, మూత్ర శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. నివేదికలు రావాల్సి ఉంది.
News February 23, 2026
T20 WC: భారత్‌కు అన్నీ ప్రతికూలాంశాలే!

T20 WC చరిత్రలో ఇప్పటివరకు హోస్ట్ నేషన్ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. అలాగే ఏ టీమ్ కూడా వరుస ఎడిషన్లలో ఛాంపియన్ కాలేదు. దీంతో ఈ సెంటిమెంట్లను భారత్ బ్రేక్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. 2024 WCని గెలవడంతో పాటు ఈసారి SLతో కలిసి IND టోర్నీని హోస్ట్ చేస్తోంది. మరోవైపు S8లో తొలి మ్యాచులోనే ఓడటం, NRR -3.800గా ఉండటం, ప్లేయర్ల ఆట తీరు, తుది జట్టు కూర్పులో సందిగ్ధం జట్టుకు ప్రతికూలంగా మారాయి.
News February 23, 2026
ఏప్రిల్ 8న AA22 ఫస్ట్ టీజర్?

అట్లీ- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో AA22 మూవీ షూటింగ్ సగం పూర్తయినట్లు సమాచారం. తదుపరి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ పెరిగింది. ఈ చిత్రంలో దీపికా పదుకొణే, రష్మిక, మృణాల్, జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే.


