News February 11, 2026

ప్రీ స్కూల్ అటెండెన్స్‌లో మన్యం జిల్లాకు అగ్రస్థానం

image

ప్రీ స్కూల్ అటెండెన్స్‌‌లో పార్వతీపురం మన్యం జిల్లా పనితీరు అద్భుతమని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ.సూర్యకుమారి కొనియాడారు. 95% అటెండెన్స్‌తో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని ఆమె పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ ప్రభాకర రెడ్డిని మంగళవారం అభినందించారు. స్టంటింగ్, అండర్ వెయిట్, ఫేస్టింగ్ సూచికల్లో కూడా మెరుగుదల కనిపించినట్లు చెప్పారు.

Similar News

News February 12, 2026

సంగారెడ్డి: ఛైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో!

image

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో అత్యంత కీలకమైన ఘట్టం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. 11 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో ఎవరీ అదృష్టం వరిస్తుందో తెలియాలి అంటే 13న కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిందే.

News February 12, 2026

నాస్తికుడి కళ్లు తెరిపించిన రాఘవేంద్ర స్వామి

image

రాఘవేంద్ర స్వామి మహిమలు అనిర్వచనీయం. ఓసారి వేదమంత్రాలను పరిహసించిన ఓ నాస్తికుడు ఎండు రోకలి చూపి దాన్ని చిగురింపజేయమని సవాలు చేశాడు. స్వామివారు చిరునవ్వుతో మంత్రజలాన్ని దానిపై చిలకరించాడు. అప్పుడు అందరూ చూస్తుండగానే ఆ ఎండు కర్ర కాస్త పచ్చని ఆకులతో చిగురించింది. ఈ అద్భుతం చూసిన ఆ నాస్తికుడు స్వామివారి పాదాలకు శరణు కోరాడు. ప్రకృతి నియమాలను కూడా భగవంతుని నామం మార్చగలదని ఈ ఘటన నిరూపిస్తుంది.

News February 12, 2026

విండీస్ విజయం.. ఇతర జట్లకు వార్నింగే!

image

టీ20 క్రికెట్ సంచలనాలకు మారుపేరు. ఈ ఫార్మాట్‌లో వెస్టిండీస్ ప్రదర్శన అద్భుతమని రికార్డులు చెబుతున్నాయి. రెండు సార్లు కప్పు గెలిచిన ఈ జట్టు తమదైన రోజున ఏ టీమ్‌నైనా ఓడించగలదు. T20 WC-2026 ఫేవరెట్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించి ఇతర జట్లకు అదే హెచ్చరికలు ఇచ్చింది. హోప్, హెట్‌మెయర్, రూథర్‌ఫోర్డ్, పావెల్ వంటి హిట్టర్లు చెలరేగితే WIకు తిరుగుండదు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని జట్లకు షాక్‌ ఇస్తుందో చూడాలి.