News November 19, 2025
ప్రెగ్నెన్సీలో అవకాడో తింటే..

అవకాడో గర్భిణులకు ఔషధ ఫలం అంటున్నారు నిపుణులు. ఇది సంతానోత్పత్తి, పిండం అభివృద్ధి, జనన ఫలితాలు, తల్లి పాల కూర్పును ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు శరీరం విటమిన్లను శోషించుకునేలా చేస్తాయి. అధిక పీచువల్ల ఆకలి తగ్గి, బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఫోలిక్ ఆమ్లం గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ లోపాలు రాకుండా చూస్తుందని చెబుతున్నారు.
Similar News
News April 15, 2026
హార్దిక్ నిర్ణయాలపై రోహిత్ సంతృప్తిగా లేరు: మాజీ క్రికెటర్

హార్దిక్ చెత్త నిర్ణయాల వల్లే RCB చేతిలో ముంబై ఓడిపోయిందని మాజీ క్రికెటర్ సడగొప్పన్ రమేశ్ అభిప్రాయపడ్డారు. ‘MIకి హార్దిక్ కెప్టెన్సీనే పెద్ద సమస్య. 7, 8వ ఓవర్లు వరుసగా స్పిన్నర్లకు ఇచ్చాడు. పాటీదార్ ఉన్నప్పుడు ఇలా చేయడం పెద్ద తప్పు. డేవిడ్‌కు హై ఫుల్ టాస్ వేసి DRSకు వెళ్లడంతో సూర్య షాకయ్యాడు. అటు రోహిత్ కూడా హార్దిక్ నిర్ణయాలపై సంతృప్తిగా లేనట్లు క్లియర్‌గా కనిపించింది’ అని తెలిపారు.
News April 15, 2026
విమానంలో మహిళపై రేప్.. భారతీయ ప్రయాణికుడిపై ఆరోపణలు

సింగపూర్ నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణిస్తున్న విమానంలో పక్కనే కూర్చున్న మహిళపై సుధీర్ కుమార్ (52) అనే భారతీయుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన స్కూట్ ఎయిర్ లైన్స్ సిబ్బంది బాధితురాలిని మరో సీటుకు మార్చినట్లు పేర్కొన్నారు. ఫ్లైట్ ల్యాండ్ అవగానే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా అక్కడి చట్టాల ప్రకారం గరిష్ఠంగా 12ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
News April 14, 2026
ఆస్ట్రేలియాలో ఐపీఎల్.. ఇండియాలో BBL?

IPL-2027లో ఒక మ్యాచును AUSలోని అడిలైడ్ ఓవల్ స్టేడియం హోస్ట్ చేసే అవకాశముంది. అక్కడ భారతీయులు ఎక్కువగా ఉండటంతో మ్యాచుకు క్రేజ్ ఎక్కువగా ఉంటుందని స్టేడియం మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే AUSలో జరిగే ‘బిగ్‌బాష్ లీగ్’ మ్యాచునూ INDలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికోసం చెన్నై స్టేడియాన్ని పరిశీలిస్తున్నట్లు టాక్. త్వరలోనే BCCIతో దీనిపై చర్చలు జరిగే ఛాన్సుంది.


