News January 20, 2026

ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలంటే?

image

గర్భం ధరించిన విషయం మహిళలు ఎంత త్వరగా గుర్తిస్తే బిడ్డకు అంత మంచిదంటున్నారు నిపుణులు. చాలామంది నెలసరి మిస్సవగానే ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకుంటారు. అప్పుడు గర్భం ధరించినా కొన్నిసార్లు నెగెటివ్‌ రావచ్చు. నెలసరి మిస్సయిన వారానికి టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్‌ అయినా ఒక్కోసారి కొంతమందిలో నెగెటివ్‌ వస్తుంటుంది. మీకు లక్షణాలేమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Similar News

News February 7, 2026

అమెరికాతో ట్రేడ్ డీల్.. వీటి ధరలు తగ్గుతాయి..!

image

ట్రేడ్ డీల్ నేపథ్యంలో అమెరికా నుంచి ఎగుమతయ్యే పలు వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. కొన్నింటిపై జీరో టారిఫ్స్ అమల్లోకి రానున్నాయి. దీంతో అమెరికా ఇండస్ట్రియల్ గూడ్స్, డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్, ఎర్ర జొన్నలు(పశువుల దాణా), ట్రీ నట్స్(బాదం, పిస్తా Etc), తాజా, ప్రాసెస్డ్ ఫ్రూట్స్, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్(విస్కీ, వోడ్కా, రమ్ తదితరాలు) వంటి ఎన్నో ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.

News February 7, 2026

805 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

C-DAC 805 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల్లో HYDలో 105 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ(సైన్స్, MCA, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు FEB 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News February 7, 2026

వాలంటైన్స్ డే స్పెషల్.. బెస్ట్ బడ్జెట్ ట్రిప్ డెస్టినేషన్స్

image

వాలంటైన్స్ డే సందర్భంగా భాగస్వామితో కలిసి ప్రకృతి ఒడిలో సమయాన్ని గడపాలనుకుంటున్న వారికి తెలుగు రాష్ట్రాల్లోనే చల్లని హిల్ స్టేషన్లు ఉన్నాయి. రూ.10,000-రూ.12,000 బడ్జెట్‌లోనే 2-3 రోజుల ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. TG ఊటీగా పిలవబడే ‘అనంతగిరి హిల్స్’ తక్కువ ధరలో అద్భుతమైన అనుభూతినిస్తుంది. APలోని ‘అరకు వ్యాలీ’, ‘లంబసింగి’, ‘హార్స్‌లీ హిల్స్’ ఫిబ్రవరిలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.