News December 26, 2025
ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా మొదటి మహిళా అధ్యక్షురాలిగా సంగీతాబారువా పిషరోతి

సీనియర్ జర్నలిస్ట్ సంగీతా బారువా పిషరోతి PCI మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అసోంకి చెందిన సంగీత ద వైర్, హిందూ, నేషనల్ హెరాల్డ్ వంటి మీడియా సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్సింగ్ చేస్తున్న ఆమె తన కెరీర్‌లో విశ్లేషణాత్మక రిపోర్టింగ్, నిబద్ధతతో దూసుకుపోతున్నారు. పిషరోతి ఏకంగా 1,019 ఓట్లతో గెలుపొందగా, ఆమె ప్యానెల్ 21-0 తేడాతో అన్ని పదవులను కైవసం చేసుకుంది.
Similar News
News December 27, 2025
జనవరి 10న PSLV-C62 ప్రయోగం

AP: PSLV-C62 రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలోని SDSC సిద్ధమవుతోంది. ఈ రాకెట్ ద్వారా EOS-N1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. వ్యవసాయం, భూ పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ తదితరాలను ఉద్దేశించి ఇస్రో ఈ ప్రయోగం చేస్తోంది. దీంతో పాటు ఓ వర్సిటీ రూపొందించిన శాటిలైట్, అమెరికాకు చెందిన ఓ చిన్న ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి పంపనున్నారు. ఇటీవల ఇస్రో చేపట్టిన బ్లూబర్డ్ ప్రయోగం సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
News December 27, 2025
పాల ఉత్పత్తి పెరగడానికి ఎలాంటి దాణా ఇవ్వాలి?

శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత సరిగా ఉండటానికి అదనపు శక్తి అవసరం. దీని కోసం సాధారణ మేతతో పాటు, శక్తినిచ్చే దాణా, సప్లిమెంట్లు ఇవ్వాలి. బెర్సీమ్ గడ్డి, వివిధ రకాల మాంసకృత్తులు కలిగిన చెక్క (వేరుశనగ చెక్క, పత్తి చెక్క, సోయా బీన్ చెక్కలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి) దినుసులను దాణాలో కలిపి పశువులకు ఇవ్వాలి. పశువులకు పెట్టే ఆహారంలో 17% ఫైబర్ ఉంటే వాటి పాల ఉత్పత్తి, కొవ్వు పరిమాణం పెంచవచ్చు.
News December 27, 2025
ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ!

AP: పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1న న్యూ ఇయర్ ఆప్షనల్ హాలిడే ఉన్న సందర్భంగా పెన్షన్లను డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అన్ని గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది డిసెంబర్ 30 నాటికి నగదు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బ్యాంకులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించింది. మిగిలిపోయిన పెన్షన్లు జనవరి 2న పంపిణీ చేయాలని పేర్కొంది.


