News February 14, 2025
ప్రేమికులు తస్మాత్ జాగ్రత్త: బజరంగదళ్

వాలంటైన్స్ డే పేరు చెప్పుకొని విచ్చలవిడిగా తిరిగే ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలని గుంటూరు జిల్లా బజరంగదళ్ నాయకులు హెచ్చరించారు. ఫిబ్రవరి 14 అంటే పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మన జవాన్లు దారుణంగా మృతిచెందిన రోజని చెప్పారు. ఇది సంతాపదినమే కానీ ప్రేమికుల దినోత్సవం కాదన్నారు. విచ్చలవిడితనానికి, లవ్ జిహాదీకి తాము వ్యతిరేకమని, ఆడవాళ్ల మాన ప్రాణాలకు రక్షణగా ఉంటామన్నారు.
Similar News
News March 12, 2025
గుంటూరు జిల్లాకు ప్రత్యేక అధికారి

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్ ఐఎఎస్ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్ ఐఎఎస్ అధికారులు కె.కన్నబాబు గుంటూరుకు, వాకాటి కరుణను పల్నాడుకు, కృతిక శుక్లాను బాపట్ల జిల్లాకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
News March 12, 2025
గుంటూరు మిర్చి ఘాటున్నా.. రేటు లేదు !

ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డులో మిర్చి ఘాటైతే ఎక్కువగా ఉంది కానీ రేటు మాత్రం లేదు. రైతులు ఆరుగాలం శ్రమించినా సరైన గిట్టుబాటుధర లభించక ఇబ్బందులు పడుతున్నారు. గత సీజన్‌లో రూ.25.వేలు పలికిన క్వింటా ఈ ఏడాది రూ.11వేలకు కూడా పలకనంటొంది. కేంద్రం రూ.11,781 చెల్లిస్తామని మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా చెప్పినప్పటికీ రైతులు ఏ మాత్రం సంతృప్తి చెందడం లేదు. రైతులు క్వింటాకి రూ.20వేలు ఆశిస్తున్నారు.
News March 12, 2025
గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ సూచనలు

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్చరించారు. సచివాలయాలకు వచ్చే ప్రజలను గౌరవించి మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, సచివాలయంలో ఇచ్చే అప్లికేషన్లో ఎటువంటి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, గుర్తులు ఉన్నవి వాడటానికి వీలులేదని స్పష్టం చేశారు.