News February 19, 2025

ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు

image

ప్రేమ పేరుతో లోబరుచుకొని తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసిన యువకుడిపై బోథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన యువతిని నారాయణపూర్ గ్రామానికి చెందిన జాదవ్ నవీన్ ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని ఆ యువతి ఒత్తిడి తేవడంతో నిరాకరించాడు. దీంతో అతనిపై అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.

Similar News

News February 21, 2025

ADB: జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులు కీలకం: కలెక్టర్

image

జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షిషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో టీఎన్జీవో నూతన జిల్లా డైరీని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి‌తోపాటు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగులు సమష్టిగా పని చేస్తూ జిల్లాను ప్రగతి పథంలో ముందు ఉంచాలని పేర్కొన్నారు.

News February 21, 2025

ADB: సమ్మర్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లా అధికారులతో కలెక్టర్ రాజర్షిషా గురువారం గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్షించారు. ప్రజాపాలన, గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయని వారు కొత్త రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుటకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు సమ్మర్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలని RWS అధికారులను ఆదేశించారు.

News February 20, 2025

ADB: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

image

ఆధార్ సర్వర్ పునరుద్ధరణ అయినట్లు, ఈనెల 21 శుక్రవారం నుంచి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జరుపనున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి గజానంద్ తెలిపారు. నాణ్యమైన పత్తిని మాత్రమే సీసీఐ వారు కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. కౌడి పుచ్చుకాయ నిమ్ము పత్తిని సీసీఐ వారు కొనుగోలు చేయరన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మార్కెట్ యార్డ్ సహకరించాలని కోరారు.

error: Content is protected !!