News March 21, 2025
ప్రేమ విఫలం.. ధర్మవరంలో యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని ధర్మవరం పట్టణం గిర్రాజు కాలనీకి చెందిన బద్దెల ఓబునాథ్(35) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందిన వివరాల మేరకు.. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. నిరాకరించిందని మనస్తాపం చెంది గురువారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓబునాథ్ టైల్స్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 28, 2025
వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పెన్నోబులేసు

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా మాల్యావంతం పెన్నోబులేసును నియమించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు జగన్మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
News March 28, 2025
ఎన్టీఆర్ పింఛన్లకు రూ.127.76 కోట్లు మంజూరు

అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 1న పంపిణీ చేయనున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీకి రూ.126.76 కోట్లు నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 2,79,165 మంది లబ్దిదారులకు పింఛన్లు ఇంటి వద్ద పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మొదటి రోజు సాంకేతిక కారణాలతో పంపిణీ జరగకుంటే రెండవ రోజు తప్పనిసరిగా ఇంటివద్ద అందిస్తారని పేర్కొన్నారు.
News March 27, 2025
లేపాక్షి: పరీక్షలు సరిగా రాయలేదనే భయంతో..

లేపాక్షి మండలం పులమతి సడ్లపల్లికి చెందిన బాబు అనే విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాబు పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదని, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంట్లో ఇబ్బంది కలుగుతుందనే భయంతో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు బాబును హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.