News October 31, 2025
ప్రైవేటు ఆసుపత్రుల్లో రేపటి నుంచి డా. ఎన్టీఆర్ వైద్య సేవలు

ప్రైవేటు ఆసుపత్రుల్లో డా. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద యథావిధిగా వైద్య సేవలు అందించనున్నట్లు తూ.గో జిల్లా సమన్వయాధికారి పి. ప్రియాంక శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల మధ్య చర్చలు సఫలం కావడంతో శనివారం నుంచి సేవలు పునఃప్రారంభం అవుతాయన్నారు. జిల్లాలోని 45 ప్రైవేటు ఆసుపత్రులు ఈ పథకం కింద ఉచిత వైద్య సేవలు అందిస్తాయని వెల్లడించారు.
Similar News
News November 1, 2025
పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: తూ.గో కలెక్టర్

‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. నవంబర్ 1వ తేదీ ఉదయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన 2,35,031 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని రాజమండ్రిలో ఆమె వివరించారు. ఇందుకోసం రూ.103.17 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News October 31, 2025
రాజమండ్రి: నవంబర్ 1 నుంచి స్వాభిమాన్ ఉత్సవాలు

బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు గిరిజన స్వాభిమాన్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్టీ సంక్షేమ, సాధికారిత అధికారి కె.ఎన్. జ్యోతి తెలిపారు. గిరిజన సమాజ చరిత్ర, వారసత్వం, సాంస్కృతిక విలువలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. నవంబర్ 1న బిర్సా ముండా జ్ఞాపకార్థం మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
News October 31, 2025
రాజమండ్రి ఎంపీపై కేసు నమోదు చేయాలి: జేటీ రామారావు

ఏపీలో అణువిద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే అదానీ కోసం రాజమండ్రి ఎంపీ పురంధీశ్వరి అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆమె పర్యటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. శ్రీకాకుళం(D) కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం USకు చెందిన వెస్టింగ్ హౌజ్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయన్నారు.


