News March 8, 2025
ప్రైవేట్ రాకెట్ ప్రయోగంలో తెనాలి మహిళ ప్రముఖ పాత్ర

ఇస్రో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంలో తెనాలికి చెందిన మహిళ ప్రముఖ పాత్ర పోషించారు. గంగానమ్మపేటకు చెందిన కొత్తమాసు సాయిదివ్య, రఘురామ్ దంపతులు ‘ఎన్ స్పేస్ టెక్నాలజీ’ సంస్థను నిర్వహిస్తున్నారు. కేఎల్‌యూలో రాడర్ కమ్యూనికేషన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న సాయిదివ్య 2022 నవంబరులో ఇస్రో పంపిన విక్రమ్-ఎస్ ప్రైవేట్ రాకెట్‌లో ఉంచిన మూడు పేలోడ్‌లలో ఒక పేలోడ్‌ను ఈమె తయారు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం అయింది.
Similar News
News December 31, 2025
GNT: SC, ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కంతేటి

గుంటూరు జిల్లా SC,ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కంతేటి బ్రహ్మయ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కమిటీకి సభ్యుడుగా నియమించిన గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారీయాకు బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం 1989లో ఏర్పాటు చేసిన చట్టాన్ని ఎవరైనా దుర్వినియోగపరిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
News December 31, 2025
గుంటూరులో పడిపోయిన గాలి నాణ్యత

గుంటూరులో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మంగళవారం AQI.in నివేదిక ప్రకారం, నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 229గా నమోదైంది. ఇది ‘సివియర్’ కేటగిరీ కిందకు వస్తుంది. గుంటూరుతో పాటు పరిసర ప్రాంతాలైన తెనాలి, బాపట్ల వైపు కూడా కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో AQI 212 నుంచి 243 మధ్య నమోదైంది. చలి తీవ్రత పెరగడం, వాహనాల కాలుష్యం కారణంగా గాలి నాణ్యత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
News December 31, 2025
అయోధ్యలో చంద్రబాబుకు ‘జాతీయ’ నీరాజనం

అయోధ్య రామమందిర రెండో వార్షికోత్సవం వేళ సీఎం చంద్రబాబు పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తి రేపింది. ఉత్తరాది భక్తులు ఆయనను ‘హైటెక్ సిటీ సీఎం’గా, మోదీ మిత్రుడిగా గుర్తించి బ్రహ్మరథం పట్టారు. అభివృద్ధి, ధర్మం అనే రెండు చక్రాలపై ఆయన రాజకీయం సాగుతోందని జాతీయ మీడియా విశ్లేషించింది. ‘రామరాజ్యమే పాలనకు ప్రామాణికం’ అని బాబు వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.


