News November 11, 2025

ప్రొటో’కాల్’ భీమేశ్వరాలయానికే పరిమితం..!

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో PRO కార్యాలయం ద్వారా లభించే ప్రొటోకాల్ సేవలు భీమేశ్వరాలయానికి మాత్రమే పరిమితమయ్యాయి. ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే VIPలు, ప్రజాప్రతినిధులు, సిఫారసు లేఖలపై వచ్చే భక్తులకు పీఆర్ఓ కార్యాలయం ద్వారా సిబ్బందిని కేటాయించి రాజన్న దర్శనానికి పంపించేవారు. అభివృద్ధి పనుల నేపథ్యంలో రాజన్న ఆలయంలో ఒకే క్యూలైన్ ద్వారా దర్శనాలు సాగుతుండడంతో ప్రొటోకాల్ సేవలు నిలిచిపోయాయి.

Similar News

News November 11, 2025

ఆపరేషన్ సిందూర్ 2.0 స్టార్ట్ అవుతుందా?

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే జైషే మహమ్మదే కారణమని నేషనల్ మీడియా చెబుతోంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరిగిన మరో ఉగ్రదాడి ఇదే. దీంతో ‘భారత గడ్డపై మరోసారి దాడి జరిగితే సహించేది లేదు’ అని ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇచ్చిన హెచ్చరికలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. దీంతో మరోసారి భారత్ యుద్ధం చేస్తుందా? అని పలువురు పోస్టులు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 11, 2025

మౌలానాకు నివాళులు అర్పించిన ఎస్పీ

image

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం నివాళులు అర్పించారు. దేశ తొలి విద్యామంత్రిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. నిరక్షరాస్యత పేదరికం రూపుమాపడానికి అనేక సేవలు చేశారని వెల్లడించారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శం అన్నారు.

News November 11, 2025

నిజామాబాద్: ఆరుగురికి జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మంగళవారం తీర్పు చెప్పారని NZB ట్రాఫిక్ CI ప్రసాద్ తెలిపారు. ఇద్దరికి 4 రోజులు, మరో ఇద్దరికి 3 రోజులు, మరో ఇద్దరికి 7 రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. అలాగే 28 మందికి రూ.2.69 లక్షల జరిమానా విధించినట్లు వివరించారు.