News April 7, 2026
ప్రొద్దుటూరుకు 2 కోర్టులు మంజూరు.!

రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టులను ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటి నిర్వహణకు 2730 పోస్టులను (ఉద్యోగులను) మంజూరు చేశారు. ప్రొద్దుటూరుకు అదనంగా మరో 2 కోర్టులు మంజూరయ్యాయి. VIIIవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, Iవ అదనపు సివిల్ జడ్జి కోర్టు మంజూరు చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే కోర్టులకు సిబ్బందిని, ఫర్నిచర్‌ను, లైబ్రరీని మంజూరు చేశారు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.