News February 21, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,580
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,334
* 10 గ్రాముల వెండి ధర రూ.2,680.
Similar News
News February 21, 2026
అక్రిడిటేషన్ కోసం జిల్లా కమిటీ ఏర్పాటు: గద్వాల కలెక్టర్

జిల్లాలోని మీడియా ప్రతినిధులకు 2026-28 సంవత్సరాల కాలానికి కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయడానికి నూతనంగా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అసోసియేషన్లు, సంఘాలు తమ ప్రతినిధి పేరును లెటర్ ప్యాడ్‌పై రాసి ఫిబ్రవరి 23 ఉదయం 11 గంటల్లోపు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
News February 21, 2026
23 నుంచి ‘ప్రజావాణి’ పునఃప్రారంభం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో యథావిధిగా వినతుల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు, దరఖాస్తుదారులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను సమర్పించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
News February 21, 2026
కేంద్ర మంత్రి పర్యటన.. గద్వాల కలెక్టర్ ఆదేశాలు

కేంద్ర మంత్రి హెచ్.డి.కుమారస్వామి ఈనెల 23న అలంపూర్‌లోని ఆలయాలను సందర్శించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం గద్వాల కలెక్టరేట్‌లో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అలంపూర్ హెలిప్యాడ్ నుంచి ఆలయాలకు వెళ్లే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.


