News November 1, 2025

ప్రొద్దుటూరులో బయటపడిన శ్రీ కృష్ణదేవరాయ శిలా శాసనం

image

ప్రొద్దుటూరులోని సినీ హబ్ శనివారం ఇంటి నిర్మాణం కోసం జేసీబీతో తవ్వుతుండగా శ్రీకృష్ణదేవరాయ శిలాశాసనం బయట పడినట్లు భారత పురావస్తు పరిశోధన డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. ఇది క్రీస్తు శకం 1523 కాలం నాటిదన్నారు. శ్రీకృష్ణదేవరాయలు తిరుమల దేవి పుణ్యం కోసం కావులూరులో చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు వెల్లడించారు. క్రీస్తు శకం 1523 జనవరి 24 శనివారం ఈ శిలా శాసనం వేయించారన్నారు.

Similar News

News November 1, 2025

కడప: హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

image

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపను ఎస్పీ నచికేత్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో వారు కలుసుకున్నారు. జిల్లాలో శాంతిభద్రతల విషయం గురించి ఎస్పీ వివరించారు. జిల్లాలో శాంతిభద్రతల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు.

News November 1, 2025

హౌసింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశాలు..!

image

ప్రొద్దుటూరు హౌసింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రొద్దుటూరు హౌసింగ్ కాలనీల్లో రూ.1,25,16,285ల విలువైన 13678.92MTల బల్క్ శాండ్ దుర్వినియోగమైనట్లు పలువురు ఆరోపించారు. AE వెంకటేశ్వర్లు, WI గుర్రప్ప, ఇందిర, కుమారిని బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు వివరాలు కోరుతూ.. DEE నుంచి ప్రొద్దుటూరు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News November 1, 2025

ప్రొద్దుటూరు హౌస్ బిల్డింగ్ సొసైటీపై DLCO విచారణ..!

image

ప్రొద్దుటూరు హౌస్ బిల్డింగ్ సొసైటీ పాలకవర్గం చర్యలపై DLCO సత్యానంద్ శనివారం విచారణ చేపట్టారు. సొసైటీ పాలకవర్గం, సబ్ రిజిస్ట్రార్ కలిసి NOC లెటర్ పేరుతో సాగించిన అన్యాయాలపై దుమారం చెలరేగడంతో DLCO విచారణ చేపట్టారు. సొసైటీ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, కార్యదర్శి విష్ణులను DLCO తన కార్యాలయానికి పిలిపించి NOCలపై విచారించారు. సంబంధిత రికార్డులను తెప్పించుకొని, NOC లెటర్ల చట్టబద్ధతపై విచారిస్తున్నారు.