News October 11, 2025

ప్రొద్దుటూరులో మట్కా బీటర్లు అరెస్ట్

image

ప్రొద్దుటూరు 2-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా జూదం ఆడుతున్నవారిని శుక్రవారం అరెస్ట్ చేసి వారినుంచి రూ.10,170లు స్వాదీనం చేసుకున్నట్లు సీఐ సదాశివయ్య తెలిపారు. తమకు రాబడిన సమాచారం మేరకు మట్కా ఆడుతున్న శ్రీనివాస నగర్‌కు చెందిన షేక్ గఫార్, కరీముల్లా, నాయబ్, రఘు, సన్న ముత్యాలు, నీలాధర్, సయ్యద్ ఖాజా, సుబ్బయ్యలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాల సమాచారం ఇవ్వాలని ప్రజలను సీఐ కోరారు.

Similar News

News October 11, 2025

ప్రొద్దుటూరులో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ప్రొద్దుటూరు: స్థానిక జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో శుక్రవారం రాత్రి షేక్ మున్నా(19) అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు 1టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మున్నా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

News October 10, 2025

కడప: ఇతనో బడా స్మగ్లర్‌.. 128 కేసులు

image

కడప జిల్లా దువ్వూరు మండలం పుల్లారెడ్డి పేటకు చెందిన దస్తగిరి రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న అతడిని అంతర్ రాష్ట్ర స్మగ్లర్‌గా గుర్తించారు. 8 ఏళ్లలో అతనిపై 128 కేసులు నమోదైయ్యాయి. ఇందులో 90 ఎర్రచందనం కేసులు, 38 దొంగతనం కేసులు ఉన్నాయి. గతంలో మూడుసార్లు పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చాడని ఎర్రచందనం ప్రత్యేక దళ సీఐ శంకర్ రెడ్డి తెలిపారు.

News October 10, 2025

కడప జిల్లాలో ఆర్టీసీకి రూ.42లక్షల ఆదాయం

image

దసరా సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడిపారు. ఈక్రమంలో ఆర్టీసీకి మంచి ఆదాయం లభించినట్లు ఆర్ఎం గోపాల్ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులు రాకపోకలు సాగించడంతో రూ.42.69 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినందుకు ఆయన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.