News August 6, 2024

ప్రొద్దుటూరు: ఎస్సీ హాస్టల్ వార్డెన్‌పై చర్యలకు వినతి

image

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రొద్దుటూరు ఎస్సీ హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. విద్యార్థి సంఘం నాయకులు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్‌కు వినతిపత్రం అందించారు. వసతి గృహంలో మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. స్థానిక విద్యార్థులను మాత్రమే చేర్పిస్తున్నారని జిల్లా అధ్యక్షులు నాగేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News March 1, 2026

వల్లూరు: చంద్రగ్రహణం సందర్భంగా పుష్పగిరి ఆలయం మూసివేత

image

వల్లూరు (M) పుష్పగిరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల మూడో తేదీన ఉదయం 6 గంటల నుంచి నాలుగో తేదీ ఉదయం ఏడున్నర వరకు తలుపులు మూసివేసి ఉంటుందని దేవాలయ ఈవో శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. చంద్రగ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహ వచనం స్వామివారికి విశేష అభిషేకం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.

News March 1, 2026

పుష్పగిరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతు

image

వల్లూరు మండలం పుష్పగిరి నదిలో ఆదివారం ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు యువకులు డ్యాం చూడటానికి వచ్చి సరదాగా నదిలో దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురు నదిలో కొట్టుకుపోయారు. అందులో సురేంద్ర(25) అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన ఇద్దరు శ్రీనాథ్, చైతన్యలు గల్లంతయ్యారు. శ్రీనాథ్ రైల్వే కొండాపురానికి చెందిన వ్యక్తిగా సురేంద్ర తెలిపారు. మృతదేహాల కోసం స్థానికులు గాలిస్తున్నారు.

News March 1, 2026

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,053 కోట్ల మద్యం అమ్మకాలు.!

image

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.1,053 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కడప రూ.288.12 కోట్లు, ప్రొద్దుటూరు రూ.185.50 కోట్లు, పులివెందుల రూ.126.07 కోట్లు, బద్వేల్ రూ.117.90 కోట్లు, మైదుకూరు రూ.101.80 కోట్లు, ఎర్రగుంట్ల రూ.80.91 కోట్లు, జమ్మలమడుగు రూ.77.01 కోట్లు, ముద్దనూరు రూ.42.97 కోట్లు, సిద్దవటం రూ.33.52 కోట్ల మద్యం విక్రయించారు.