News September 13, 2025
ప్రొద్దుటూరు: టీవీ చూడొద్దన్నందుకు ఆత్మహత్య

పనీపాటా లేకుండా పొద్దస్తమానం టీవీ చూస్తుంటే జీవనం ఎలా గడుస్తుందని తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రొద్దుటూరులో జరిగింది. 3వ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ వేణుగోపాల్ వివరాల మేరకు.. YMR కాలనీలో నివాసం ఉంటున్న హమాలి వర్కర్ రంగనాయకులు కుమారుడు మాణిక్యం శుక్రవారం ఉదయాన్నే టీవీ చూస్తుండటంతో తల్లి మందలించింది. మనస్తాపం చెందిన మాణిక్యం(21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News September 13, 2025
సకల జనుల సమ్మెకు 14 ఏళ్లు: KTR

TG: తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మె స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిందని KTR ట్వీట్ చేశారు. ‘ఈ ఉద్యమానికి నేటితో 14 ఏళ్లు నిండాయి. ఇందులో పాల్గొన్న వారికి ధన్యవాదాలు. 2011, SEP 12న కరీంనగర్ జనగర్జనలో KCR పిలుపు మేరకు యావత్ తెలంగాణ సమాజం ఒక్కటయ్యింది. ఔర్ ఏక్ ధక్కా.. తెలంగాణ పక్కా అంటూ నినదించింది. నిరసన తెలిపి తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసింది’ అని పేర్కొన్నారు.
News September 13, 2025
కిలో టమాటా రూ.4

నిన్న, మొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా రేటు ఒక్కసారిగా పడిపోయింది. కర్నూలు(D) పత్తికొండ, నంద్యాల(D) ప్యాపిలి మార్కెట్లలో కిలో రూ.4 నుంచి రూ.6 మాత్రమే పలికింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు పొలాల్లోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టి కోయించినా గిట్టుబాటు ధర రావటం లేదని మరికొందరు రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.30కి అమ్ముతున్నారు.
News September 13, 2025
అనకాపల్లిలో నేడే మెగా జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కొణతాల హాజరవుతారన్నారు. 25 బహుళ జాతి కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివి 18 నుండి 35 సంవత్సరాల లోపు గల యువతీ యువకులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు.