News October 12, 2025
ప్రొద్దుటూరు: నకిలీ మద్యం ఇలా గుర్తించండి.!

స్కాన్ చేసి నకిలీ మద్యాన్ని గుర్తించొచ్చని పొద్దుటూరు ఎక్సైజ్ సీఐ సురేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. APTATS యాప్ ప్లేస్టోర్ నుంచే డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్ల మూతపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తయారీ వివరాలు వస్తాయన్నారు. ఆ మద్యం బాటిల్ ఒరిజినలా? నకిలీనా? అనే సమాచారం తెలుస్తుందన్నారు. ప్రొద్దుటూరులో దుకాణాల్లో నకిలీ మద్యం లేదన్నారు.
Similar News
News October 12, 2025
జూబ్లీహిల్స్ అడ్డా.. ఎవరిది బిడ్డా..?

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అటు BRS, ఇటు కాంగ్రెస్ జోరు పెంచాయి. నువ్వానేనా అన్నట్లు రేసులో పరుగెత్తుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు, ఏరియాలకు MLAలు, MLCలు, మాజీ MLAలను ఇన్‌ఛార్జులుగా BRS నియమించడంతో వారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మంత్రులు, స్టేట్ లీడర్లు రంగంలోకి దిగి డివిజన్ల వారీగా పర్యటిస్తున్నారు. జూబ్లీహిల్స్ థగ్ ఆఫ్ వార్‌లో గెలిచేదెవరో?

HYD: మహిళలూ మీకోసమే.. వేదిస్తే ఇలా చేయండి!

యువతులు, మహిళలు ఇబ్బందులు పడితే ఇలా ఫిర్యాదు చేయండి. గృహహింస, వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు, లింగ వివక్షత, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, అత్యాచారం, సైబర్ నేరాలు, అక్రమన రవాణా, బలవంత వ్యభిచారం వంటి వాటిపై ఫిర్యాదు చేయొచ్చు. మీకు అండగా ఉంటామని HYD ప్రోగ్రాంలో మహిళా కమిషన్ తెలిపింది. హెల్ప్ లైన్ 040 27542017, telanganastatewomencommission@gmail.com సంప్రదించండి.