News December 28, 2025
ప్రొద్దుటూరు: ‘నిర్మాణాలు పూర్తి కాకుండానే బిల్లుల చెల్లింపు’

PDTR పేజ్-3 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించారు.
*JNR రూ.2.67కోట్లు, పోండ్ల శివశంకర్ రూ.24.79 లక్షలు
*వాసవి ఇన్‌ఫ్రా రూ.31.73 కోట్లు, వినాయక రూ.2.40 కోట్లు
*వెంకటేశ్వర రూ.10.04 కోట్లు, సిరి ఫ్లైయాష్ రూ.1.66 కోట్లు
*తబాసుమ్ బిల్డర్స్ రూ.72.01 లక్షలు, గుర్రం రవి రూ.3.28 కోట్లు
*ఉప్పలపాటి కనకరాజు రూ.38.51లక్షలు, కృష్ణమ్మ రూ.4 కోట్లు
*రవిప్రకాష్ రూ.65 లక్షలు చెల్లింపులు చేశారు.
Similar News
News December 29, 2025
కడప: 2025లో రైతులకు కష్టాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు

మరో 2 రోజుల్లో 2025కు వీడ్కోలు చెప్పి 2026కు ఆహ్వానం పలుకుతాం.. అయితే ఈ ఏడాది మిర్చి, ఉల్లి పంటలకు సరైన గిట్టుబాటు ధరలేక జిల్లా రైతులు ఇబ్బందులు పడ్డారు. అంతే కాకుండా అకాల వర్షాలతో రైతన్నను మరింత ఊబిలోకి దింపింది. ఈ ఏడాది ఉమ్మడి కడప జిల్లా నుంచి 680 మంది టీచర్లుగా.. 323 మంది కానిస్టేబుళ్లుగా ఎంపిక కావడంతో వారి కుటుంబసభ్యులు సంతోషంగా ఉన్నారు. మరి ఈ ఏడాది సంతోషపెట్టిన, బాధపెట్టిన విషయాలేంటో కామెంట్.
News December 29, 2025
ఒంటిమిట్ట: వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం

ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయంలో ఈ నెల 30న జరగబోయే వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆదివారం TTD ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, చంటి బిడ్డల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనట్లు TTD AE అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఆరోజు భక్తులకు ప్రసాదం, అన్న ప్రసాదం అందుబాటులో ఉంటుందని TTD DEO ప్రశాంతి తెలియజేశారు.
News December 29, 2025
పుష్పగిరిలో ఒకే పలకపై త్రిమూర్తుల అరుదైన కుడ్య శిల్పం

వల్లూరు(M) పుష్పగిరి క్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై ఒకే పలకపై త్రిమూర్తుల అరుదైన కుడ్య శిల్పం అద్భుతంగా ఉందని రచయిత చరిత్రకారుడు బొమ్మి శెట్టి రమేశ్ ఆదివారం తెలిపారు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు సృష్టి పాలకుడు, పరమేశ్వరుడు సృష్టి లయ కారకుడన్నారు. త్రిమూర్తులు ఒకే పరబ్రహ్మం మూడు రూపాలు అని చెప్పారు.


