News August 17, 2024
ప్రొద్దుటూరు: నేడు వైద్య సేవలు బంద్

ప్రొద్దుటూరులోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో శనివారం వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రొద్దుటూరు ఐఎంఏ అధ్యక్షుడు డా. మహేష్, కార్యదర్శి డాక్టర్ హరీష్ కుమార్ తెలిపారు. కలకత్తాలో మహిళ వైద్యురాలిపై జరిగిన అమానుష సంఘటనను నిరసిస్తూ ఐఎంఏ ఒకరోజు వైద్య సేవల బంద్‌కు పిలుపునిచ్చిందని, ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యవసర సేవలు మినహా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News July 9, 2025
కడప: మెరిట్ ఆధారంగా నేరుగా అడ్మిషన్లు

కడపలోని డా. వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి బి.డిజైన్, బి.ఎఫ్.ఎ కోర్సులలో మెరిట్ ఆధారిత డైరెక్ట్ అడ్మిషన్లకు ఏపీఎస్ఎచ్ఈ అనుమతి లభించిందని వీసీ ప్రొఫెసర్ జి. విశ్వనాథ్ కుమార్ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News July 9, 2025
ముద్దనూరులో యాక్సిడెంట్

ముద్దనూరులోని కొత్తపల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగింది. రాజంపేట నుంచి తాడిపత్రి వైపు వెళుతున్న బొలేరో క్యాంపర్ మినీ లారీ ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. దీంతో బొలేరోలో ఉన్న రజాక్, గోవిందమ్మ, శివమ్మ, మరొకరికి గాయాలయ్యాయి. వారిని ముద్దనూరు 108 వాహన సిబ్బంది సుబ్రహ్మణ్యం ప్రొద్దుటూరు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.
News July 9, 2025
Y.S జగన్‌కు మరో పదవి

సింహాద్రిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌరవ ఛైర్మన్‌గా పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డిని నియమించారు. ఛైర్మన్‌గా బండి రామసూరరెడ్డి, వైస్ ఛైర్మన్‌గా వి.ఓబులేసును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ప్రకటన విడుదల చేశారు.