News January 20, 2025

ప్రొద్దుటూరు: ‘ప్రభుత్వం అప్పులు, ఖర్చులను తెలపాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను, ఖర్చులను మీడియా ద్వారా ప్రజలకు తెలపాలని ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు తహశీల్దార్ గంగయ్యకు ఆయన వినతిపత్రం అందించారు. లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించిన సొమ్మును ప్రభుత్వం అప్పులకు చెల్లిస్తోందన్నారు. ప్రతినెల ప్రభుత్వం చేస్తున్న ఖర్చులను, అప్పులను ప్రజలకు వివరించాలన్నారు.

Similar News

News February 20, 2026

‘కడప జిల్లాలో 18,532 మెట్రిక్ టన్నుల పంట కొనుగోలు’

image

రైతులు దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా సూచించారు. జిల్లాలో 80,103 హెక్టార్లలో శనగ పంట సాగు చేశారన్నారు. 15 కొనుగోలు కేంద్రాల ద్వారా 18,532 మెట్రిక్ టన్నులు పంట కొనుగోలు చేస్తామన్నారు. రైతులు రైతు సేవా కేంద్రంలో పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.

News February 20, 2026

శనగల కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోండి: JC

image

జిల్లాలో ఏర్పాటు చేసిన 21 శనగ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా సూచించారు. రాజుపాలెం మండలంలోని రైతు సేవా కేంద్రం, ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో శనగ కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. రైతులు శనగ పంటను బాగా ఆరబెట్టి, శుభ్రపరిచి, తేమ శాతం 14% లోపు ఉండేలా చూసుకుని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలుపై అధికారులు వివరించారు

News February 20, 2026

కడప జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాలు ఇవే:

image

జిల్లాలో 21 శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు JC నిధిమీనా తెలిపారు. పులివెందుల, తొండూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పెద్దముడియం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, మైలవరం, కొండాపురం, రాజుపాలెం, దువ్వూరు, వల్లూరు, పెండ్లిమర్రి, సింహాద్రిపురం, V.Nపల్లె, వేముల, వేంపల్లె, లింగాల, పోరుమామిళ్లలో శనగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ రైతుల నుంచి క్వింటా శనగను రూ.5,875తో కొనుగోలు చేస్తామన్నారు.