News August 28, 2025

ప్రొద్దుటూరు: ‘మీరు ప్రతిజ్ఞ చేయండి’

image

మాదకద్రవ్యాలతో విద్యార్థుల భవిష్యత్తు సర్వనాశనమవుతుందని పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డా. శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. గురువారం గోపవరం వద్ద ఉన్న పశువైద్య కళాశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు జరిగింది. మత్తుపదార్థాల వినియోగంతో ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. మాదకద్రవ్యాలు వాడమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి.. జిల్లా ప్రజలు కూడా మాదకద్రవ్యాలను దూరం పెట్టాలన్నారు.

Similar News

News August 29, 2025

గణేశుడి నిమజ్జనానికి బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ

image

జిల్లాలో శుక్రవారం నిర్వహించనున్న గణేశ్ నిమజ్జనానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కడప ఎస్పీ అశోక్ కుమార్ గురువారం రాత్రి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు రూపొందించిన యాప్ ద్వారా నిర్వాహకులు 4,500 విగ్రహాలకు అనుమతులు తీసుకున్నారన్నారు. ఈనెల 29న 1600 గణేశ్ విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారన్నారు. అన్ని శాఖల అధికారులతో కలిసికట్టుగా నిమజ్జన ఏర్పాట్లు చేశామని, నిర్వాహకులు తమకు సహకరించాలని కోరారు.

News August 28, 2025

కడప: నేడు డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

image

డీఎస్సీ 2025కు ఎంపికైన అభ్యర్థులకు గురువారం ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం జరగనుందని డీవో ఓ. శంషద్దీన్ బుధవారం తెలిపారు. కడప నగరంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.17 బృందాలు పరిశీలన చేస్తాయని, నాలుగు బృందాలకు ఒక డిప్యూటీ ఉంటారన్నారు. పరిశీలనకు హాజరు కాకుంటే అభ్యర్థిత్వం రద్దవుతుందన్నారు.

News August 28, 2025

కడప: శనగలతో వినాయకుడు

image

వినాయక చవితి పండుగ సందర్భంగా కడప నగరంలో ఊరగాయల వీధిలో ప్రత్యేక అలంకరణలో వినాయకుని రూపొందించారు. మట్టి వినాయకుని ప్రతిష్ఠించడంతో పాటు ప్రత్యేకంగా శనగలతో వినాయకుని రూపొందించి ప్రత్యేకంగా పూజలు చేశారు. వంకదార రాము ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కో పదార్థాలతో వినాయకుని రూపొందిస్తూ కడప ప్రజలకు ఆకర్షణంగా నిలుస్తున్నారు. స్వామిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు