News March 27, 2025

ప్రొద్దుటూరు: 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు

image

ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు నమోదైంది. మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన విద్యార్థి 32 ఫేక్ ఇన్‌స్టాగ్రాం అకౌంట్లతో తన క్లాస్ అమ్మాయిలను వేధించాడు. విషయం తెలిసిన టీచర్ విద్యార్థిని హెచ్చరించారు. తమ బిడ్డనే మందలిస్తారంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో వారితో పాటు మరో వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది.

Similar News

News March 30, 2025

పంచెకట్టులో కడప కలెక్టర్

image

కడప కలెక్టరేట్లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సంబరాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ,మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఏడాదిలో అందరికి శుభం కలగాలని ప్రార్థించారు. పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు.

News March 30, 2025

జిల్లాలో భారీగా సీఐల బదిలీలు

image

కర్నూలు రేంజ్ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం రేంజ్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. కర్నూలు, కడప జిల్లాలో దాదాపు 16 మంది సీఐలను బదిలీ చేశారు. ఇందులో కొంతమందికి పోస్టింగ్ ఇవ్వగా మరికొంతమంది సీఐలను విఆర్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.

News March 30, 2025

రామయ్య కల్యాణానికి CMకు ఆహ్వానం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న రాములోరి కళ్యాణం జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కల్యాణోత్సవానికి రావాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఆదివారం వారు తాడేపల్లిలోని CM క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబును కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు.

error: Content is protected !!