News December 1, 2025
ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారా?

ప్రోటీన్ పౌడర్‌లను సాధారణంగా గుడ్లు, పాలు, సోయా, బఠానీలు లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతో తయారు చేస్తారు. కొన్నిసార్లు వీటి మూలాల మిశ్రమంతో తయారు చేస్తారు. చక్కెరతో కూడిన ఈ సప్లిమెంట్‌లు సమతుల్య ఆహారం ఉద్దేశ్యాన్ని విరుద్ధంగా ఉండడమే కాకుండా, మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వైద్యుల సలహా లేకుండా వీటిని వాడకూడదని సూచిస్తున్నారు.
Similar News
News March 9, 2026
చిరంజీవి రాంగ్ టైమ్‌లో పార్టీ పెట్టారు: శివాజీ

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై నటుడు శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘చిరంజీవి రాష్ట్రం విడిపోయిన తర్వాత పార్టీ పెట్టి ఉండాల్సింది. అలా అయితే సీమాంధ్రలో కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేవారు. రాంగ్ టైమ్‌లో పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల వరకైనా పార్టీని కొనసాగించి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేవారేమో’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
News March 9, 2026
ట్రోఫీతో గుడికి.. మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

1983 WC విజేత, TMC MP కీర్తి ఆజాద్ టీమ్ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. T20 WC ట్రోఫీతో <<19333290>>హిందూ ఆలయానికి<<>> వెళ్లడాన్ని తప్పుబట్టారు. టీమ్ఇండియా 140 కోట్ల భారతీయులు, అన్ని మతాలను రిప్రజెంట్ చేస్తుందని.. కేవలం ఒక మతానిదో లేదా జై షా కుటుంబానిదో కాదని విమర్శించారు. సిరాజ్ మసీదుకు లేదా శాంసన్ చర్చికి ట్రోఫీని తీసుకెళ్లలేదన్నారు. ఒకే మతం చుట్టూ విజయాన్ని తిప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.
News March 9, 2026
గ్యాస్ కొరత.. బెంగళూరులో హోటల్స్ బంద్!

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపేయడంతో హోటళ్లను ఆపరేట్ చేయలేకపోతున్నామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘పశ్చిమాసియాలో యుద్ధం వల్ల వాణిజ్య వంట గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయింది. రేపటి నుంచి బెంగళూరులోని రెస్టారెంట్లు బంద్ అవుతాయి’ అని ఓ ప్రకటనలో తెలిపింది.


