News November 27, 2025

ప్లాన్ చేసి సీ సెక్షన్ చేయించుకుంటున్నారా?

image

సహజ ప్రసవం ద్వారా పుట్టిన వారితో పోలిస్తే సీ సెక్షన్‌‌తో పుట్టిన పిల్లలు లింఫోబ్లాస్టిక్‌ లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ అని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధకులు వెల్లడించారు. అలాగే నార్మల్ డెలివరీ సమయంలో బిడ్డపై కొన్ని రకాల బ్యాక్టీరియా ప్రభావం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో అలర్జీలు, ఆటోఇమ్యూన్‌ సమస్యలు రావని మంచి బ్యాక్టీరియా పెరుగుదల బాగుంటుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

Similar News

News November 28, 2025

పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

image

AP: YCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. సరెండర్ కావడానికి 2 వారాల గడువు ఇచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం వారు గతంలో హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. దీంతో SCని ఆశ్రయించారు.

News November 28, 2025

ఏకగ్రీవాలకు వేలంపాటలు.. SEC వార్నింగ్

image

TG: సర్పంచ్ ఎన్నికల వేళ ఏకగ్రీవాలకు జోరుగా వేలంపాటలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ పదవిని అంగట్లో సరుకులా డబ్బులు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు ప్రకటించేశారు. దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాల్సిన పదవిని వేలంపాటలో కొనుగోలు చేయడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News November 28, 2025

IPLలో వైభవ్.. WPLలో దీయా

image

WPL వేలంలో హరియాణాకు చెందిన 16 ఏళ్ల దీయా యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించారు. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్ అయిన ఆమెను రూ.10 లక్షల బేస్ ప్రైజ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. దీంతో WPLలో అడుగుపెట్టిన పిన్న వయస్కురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. 2023 U-15 ఉమెన్స్ ట్రోఫీలో 578 రన్స్ బాదడంతో దీయా పేరు తెరపైకి వచ్చింది. వైభవ్ సూర్యవంశీ 13ఏళ్లకే IPLలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.