News March 11, 2026

ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

image

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆహారపదార్థాలను ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో బిస్పినాల్‌ ఏ (BPA) రసాయనం ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్‌, టెస్టోస్టిరాన్‌ సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS, టైప్‌2 డయాబెటిస్‌, నాడీ వ్యవస్థ సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Similar News

News March 27, 2026

ఏప్రిల్ 21లోగా ఇంటర్ ఫలితాలు!

image

AP: ఇంటర్ ఎగ్జామ్స్ వాల్యుయేషన్‌ను ఏప్రిల్ 10-14 మధ్య పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 21లోపు ఫలితాలను వెల్లడించనున్నట్లు సమాచారం. మే తొలి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలకు దాదాపు 10.37 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

News March 27, 2026

ధరలను నియంత్రించేందుకే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం: కేంద్రం

image

ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్‌పై <<19487934>>ఎక్సైజ్ డ్యూటీ<<>> తగ్గించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటర్‌కు 21.5, జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటర్‌కు 29.5 చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్‌కు అమ్ముకోకుండా దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తాయని పేర్కొన్నారు.