News January 19, 2026

ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్

image

స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ భారత్ యాత్ర’ వాహనం 9వ రోజు సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకుంది. ఈ వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, తడి-పొడి చెత్త ఏర్పాటు, వ్యర్థాల నుంచి వస్తువుల తయారీ విధానాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన వీక్షించారు.

Similar News

News January 30, 2026

సంగారెడ్డి: ఎన్నికల ఖర్చుపై నిఘా.!

image

మున్సిపల్ ఎన్నికల ప్రచార ఖర్చులపై నిశితంగా నిఘా ఉంచాలని వ్యయ పరిశీలకులు రాకేష్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. భారీ నగదు లావాదేవీలు, అనుమానాస్పద వస్తువుల సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 30, 2026

ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% గ్రాస్ శాలరీ

image

AP: వైద్యారోగ్య శాఖలో నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగుల్లో రెగ్యులరైన 1560 మందికి 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని ప్రభుత్వం GO ఇచ్చింది. టైమ్ స్కేల్ అమలుతో వీరి జీతాలు 2023 SEP-2024 MAR మధ్య తగ్గాయి. అయితే కోర్టు తీర్పు ఇతర కారణాలతో వారికి పూర్తి వేతనం ఇవ్వడంతోపాటు అరియర్స్ చెల్లించాలని తాజాగా నిర్ణయించింది. జీతాలకు ఏటా ₹21,51,36,724 అదనపు భారం GOVTపై పడుతుంది. అరియర్ల కింద ₹16,45,41,361 చెల్లించనుంది.

News January 30, 2026

‘హౌసింగ్ కార్పొరేషన్’ పునరుద్ధరణ… డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ బదిలీ

image

TG: గత BRS ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్‌ను ఎత్తేసి సిబ్బందిని R&Bలో విలీనం చేసింది. కీలకమైన డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ఆ శాఖకు అప్పగించింది. అప్పట్నుంచీ నిర్మాణాలను ఆ శాఖే చేపడుతోంది. అయితే స్కీమ్‌ను స్పీడప్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్‌ను తిరిగి కొనసాగించేలా చర్యలు చేపట్టింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. డబుల్ బెడ్ రూమ్ స్కీమ్‌ను R&B నుంచి ఆ సంస్థకు అప్పగించింది.