News December 26, 2025
ప్లాస్టిక్ రహిత మేడారం సాధ్యం కదా..?

వనదేవతల చెంత ప్లాస్టిక్ వ్యర్ధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జాతర ముగిసిన తర్వాత మేడారంతో పాటు పరిసర గ్రామాలు కాలుష్య కాసారంగా మారుతున్నాయి. ప్లాస్టిక్ భూమిలో కలవక సారం కోల్పోతుండగా, వాటిని తిన్న పశువులు చనిపోతున్నాయి. ప్రభుత్వం స్పందించి ప్లాస్టిక్ రహిత జాతర కోసం కార్యాచరణ రూపొందించాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించి అడవి తల్లిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
Similar News
News December 27, 2025
చలికాలంలో పెరుగుతో జలుబు చేస్తుందా?

చలికాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందనేది అపోహ అని వైద్యులు చెబుతున్నారు. ‘పెరుగుతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో మందగించే జీర్ణక్రియకు చెక్ పెట్టి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అలాగే అందులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది’ అని అంటున్నారు. అయితే ఫ్రిడ్జ్ నుంచి తీసిన పెరుగును వెంటనే తినొద్దని సూచిస్తున్నారు.
News December 27, 2025
ధనుర్మాసం: పన్నెండో రోజు కీర్తన

‘లేగదూడలను తలచుకొని గేదెలు కురిపించే పాలధారలతో వాకిళ్లన్నీ తడిసిపోతున్నాయి. ఇంతటి ఐశ్వర్యం కలిగిన గోపాలుని సోదరీ! బయట మంచు కురుస్తున్నా, మేమంతా వేచి ఉన్నాము. శ్రీరాముడు ఆనాడు రావణుడిని సంహరించిన వీరగాథలను మేమంతా భక్తితో పాడుతున్నాము. ఇంత జరుగుతున్నా నీవు మాత్రం నిద్ర వీడటం లేదు. నీ భక్తి పారవశ్యం మాకు అర్థమైంది. ఇకనైనా ఆ నిద్ర చాలించి, మాతో కలిసి ఆ మాధవుని సేవలో పాల్గొనవమ్మా!’ <<-se>>#DHANURMASAM<<>>
News December 27, 2025
ఖమ్మం: సొంత పార్టీ నేతలపైనే ‘హస్తం’ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీలో ఉంటూనే ప్రత్యర్థి వర్గాలకు సహకరించారని వారిపై పలువురు MLAలు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే MLAలు మట్టా రాగమయి దయానంద్, పాయం వెంకటేశ్వర్లు, మాజీ MLA పొదెం వీరయ్య బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇదే అంశాన్ని CM, Dy.CM దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.


