News March 15, 2025

ప్లాస్టిక్ వాడకండి: నన్నయ వీసీ

image

పర్యావరణానికి విఘాతంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ పిలుపునిచ్చారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఆమె క్యాంపస్‌ను శుభ్రం చేశారు. అనంతరం ఇంజినీరింగ్ విద్యార్థులు నిర్వహించిన ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీలోనూ ఆమె పాల్గొన్నారు.

Similar News

News February 13, 2026

తూ.గో జిల్లాలో ఈనెల 17న డీ-వార్మింగ్ డే- డీఎంహెచ్‌ఓ

image

తూర్పుగోదావరి జిల్లాలోని అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో ఈ నెల 17న జాతీయ డీ-వార్మింగ్ డే నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ రోజు మాత్రలు వేసుకోలేని వారి కోసం 24న ‘మాప్-అప్ డే’ ఏర్పాటు చేశామన్నారు. వయసును బట్టి ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని, పిల్లలకు ఆహారం తిన్న తర్వాతే వీటిని వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News February 13, 2026

రాజమండ్రి: అరినా-3 పూర్తి చేయాలి.. కేంద్రమంత్రికి పురందేశ్వరి వినతి

image

రాజమండ్రి వి.ఎల్ పురంలోని అరినా-3 క్రీడా సముదాయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి కోరారు. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. నగర యువతకు ఆధునిక క్రీడా వసతులు కల్పించడంతో పాటు, రాబోయే గోదావరి పుష్కరాల సమయంలో ఈ ప్రాజెక్ట్ బహుళ ప్రయోజనకారిగా మారుతుందని ఆమె పేర్కొన్నారు.

News February 13, 2026

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే బత్తుల భేటీ

image

సీఎం చంద్రబాబుతో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందించారు. 2027 పుష్కరాలకు రాజానగరం నియోజకవర్గానికి ప్రాధాన్యత నిచ్చి తగిన నిధులు కేటాయించాలని, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. వాటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.