News February 23, 2026

ప్లేయింగ్-11లోకి సంజూ? కోచ్ ఏమన్నారంటే?

image

సంజూ శాంసన్ అద్భుతమైన ప్లేయర్ అని టీమ్‌ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కాటే అన్నారు. టాప్ ఆర్డర్‌లో రైట్ హ్యాండర్ ఉండటం కూడా టాక్టికల్‌గా హెల్ప్ అవుతుందని, రాబోయే మ్యాచులకు ఇది టాకింగ్ పాయింట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. T20 WC S-8లో SA చేతిలో ఓడిన అనంతరం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొన్ని నెలలుగా బాగా ఆడుతూ ఇప్పుడు ఫామ్ కోల్పోయిన వారిని ఆడించాలా లేదా అనేది సందిగ్ధంగా మారిందన్నారు.

Similar News

News March 2, 2026

దూడలలో తెల్లపారుడు వ్యాధి లక్షణాలు

image

గేదె, సంకర జాతి దూడల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారతాయి. దీని నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధికి గురైన దూడల శరీరం నుంచి నీరు కోల్పోయి కళ్లగుంటలు బాగా లోపలికి పోయి ఉంటాయి. చర్మము ముడతలు పడి ఉంటుంది. చివరకు వ్యాధి తీవ్రంగా మారితే దూడ ఎక్కువగా పారి నీరసించి చనిపోతుంది. అందుకే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వెటర్నరీ వైద్యునికి చూపించాలి.

News March 2, 2026

హైదరాబాద్ చేరుకున్న రాహుల్

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. వీరిద్దరూ కాసేపట్లో వికారాబాద్ జిల్లా అనంతగిరికి చేరుకోనున్నారు. అక్కడ జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా రానున్నారు.

News March 2, 2026

బీర సాగుకు అనువైన విత్తన రకాలు

image

బీర పంటలో మంచి దిగుబడి రావాలంటే విత్తన ఎంపిక ముఖ్యం. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ రూపొందించిన అర్క సుజాత, అర్క ప్రసన్న, అర్క సుమిత్, అర్క విక్రమ్ వంటి రకాలతో పాటు.. సురేఖ, సంజీవని, మహిమ, ఎన్.ఎస్-3(NS-3), ఎన్‌.ఎస్‌.401 (NS-401), ఎన్.ఎస్.403 (NS-403), అర్జున్, లతిక, మల్లిక, నాగ వంటి హైబ్రిడ్ రకాలతో మంచి దిగుబడులను సాధించవచ్చు. మీ ప్రాంతాన్ని బట్టి నిపుణుల సూచనలతో వీటిలో రకాలను ఎంపిక చేసుకోవాలి.