News May 20, 2024

ప.గో.: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

ప.గో. జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. SI శ్రీనివాసరావు తెలిపిన వివరాలు.. పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన త్రినాథ్ ప్రసాద్‌‌కు 15ఏళ్ల క్రితం సుస్మితతో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారు. ఈ క్రమంలో సుస్మిత ఉరేసుకొని చనిపోయిందని ఆమె తండ్రికి ఫోన్లో చెప్పాడు. కూతురి మృతికి కారణం ఆమె భర్త, అత్తమామలే అంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.

Similar News

News November 4, 2025

భీమవరం: PCPNDT జిల్లా సలహా సంఘం సమావేశం

image

భీమవరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ జి. గీతాబాయి అధ్యక్షతన పీసీపీఎన్‌డీటీ జిల్లా సలహా సంఘం సమావేశం జరిగింది. జిల్లాలో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. కొత్త స్కానింగ్ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన 4 దరఖాస్తులు, 2 పునరుద్ధరణ దరఖాస్తులు, 4 మార్పుల దరఖాస్తుల అనుమతులపై కూడా సలహా సంఘం చర్చించినట్లు ఆమె తెలిపారు.

News November 3, 2025

నరసాపురం: భారీ దొంగతనం కేసులో చేధించిన పోలీసులు

image

నరసాపురం(M) తూర్పుతాళ్లులో గతేడాది సెప్టెంబర్‌లో బంగారు షాపులో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. సోమవారం ఎస్పీ నయీమ్ అస్మి తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనానికి పాల్పడిన వారిలో నలుగురిని ఇవాళ అరెస్టు చేశారు. ఇదే కేసులో దొంగ బంగారం కొన్నట్లు తేలడంతో ముగ్గురు గోల్డ్ షాప్ యాజమానులపైనా కేసులు నమోదు చేశారు. మొత్తంగా 666గ్రా బంగారం, 2,638 గ్రాముల వెండి, నాలుగు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు.

News November 3, 2025

భీమవరం: నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రారంభించిన మీ కోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) యథావిధిగా జరుగుతుందని ఆమె చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పీజీఆర్‌ఎస్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.