News June 13, 2024
ప.గో: ‘అమాత్యులారా.. మా సమస్యలివిగో..!’

ఉమ్మడి ప.గో జిల్లాల్లో ఇద్దరికి మంత్రి పదవులు దక్కడంతో ప్రగతిపై ప్రజలకు ఆశలు చిగురిస్తున్నాయి. పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, నూజివీడు నుంచి కొలుసు పార్థసారథి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో సాగునీటి, డెల్టా ఆధునికీకరణ, ఏటిగట్లు, వైద్య కళాశాల, ఫిషింగ్ హార్బర్, ఆక్వా వర్సిటీ, తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకా ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News November 4, 2025
భీమవరం: PCPNDT జిల్లా సలహా సంఘం సమావేశం

భీమవరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ జి. గీతాబాయి అధ్యక్షతన పీసీపీఎన్‌డీటీ జిల్లా సలహా సంఘం సమావేశం జరిగింది. జిల్లాలో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. కొత్త స్కానింగ్ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన 4 దరఖాస్తులు, 2 పునరుద్ధరణ దరఖాస్తులు, 4 మార్పుల దరఖాస్తుల అనుమతులపై కూడా సలహా సంఘం చర్చించినట్లు ఆమె తెలిపారు.
News November 3, 2025
నరసాపురం: భారీ దొంగతనం కేసులో చేధించిన పోలీసులు

నరసాపురం(M) తూర్పుతాళ్లులో గతేడాది సెప్టెంబర్‌లో బంగారు షాపులో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. సోమవారం ఎస్పీ నయీమ్ అస్మి తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనానికి పాల్పడిన వారిలో నలుగురిని ఇవాళ అరెస్టు చేశారు. ఇదే కేసులో దొంగ బంగారం కొన్నట్లు తేలడంతో ముగ్గురు గోల్డ్ షాప్ యాజమానులపైనా కేసులు నమోదు చేశారు. మొత్తంగా 666గ్రా బంగారం, 2,638 గ్రాముల వెండి, నాలుగు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు.
News November 3, 2025
భీమవరం: నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) యథావిధిగా జరుగుతుందని ఆమె చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.


