News July 21, 2024
ప.గో.: ఆందోళనలో ఆక్వా రైతులు

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గి చేపలు, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ లోటు ఏర్పడుతోంది. ఫలితంగా చేపలు, రొయ్యలు నీటిపై తేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప.గో. జిల్లాలో 2.6 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. చెరువుల్లో ఆక్సిజన్ శాతం పెంచడానికి ఏరియేటర్లు తిప్పడంతో పాటు మందులు వాడుతున్నారు. అదనపు ఖర్చులు అవుతున్నాయని వాపోతున్నారు.
Similar News
News December 30, 2025
భీమవరం: ఈవీఎంల భద్రతపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

భీమవరం పట్టణంలోని పీపీ రోడ్డులో గల ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్లకు వేసిన సీళ్లను, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె, రిజిస్టర్లలో సంతకాలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి మూడు నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News December 30, 2025
పాలకొల్లు ఉపాధ్యాయునికి ‘గురు చైతన్య’ పురస్కారం

పాలకొల్లు: పట్టణంలోని జీవీఎస్వీఆర్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని జి.నందిని ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు ఎంపికయ్యారు. గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లాకు ఏడుగురు చొప్పున ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. జనవరి 3న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
News December 30, 2025
వంద ఏళ్ల నిరీక్షణకు తెర.. ‘మోదెల’ గ్రామానికి విద్యుత్ భాగ్యం!

శతాబ్ద కాలంగా విద్యుత్‌కు నోచుకోని మారుమూల గిరిజన గ్రామం ‘మోదెల’ ఎట్టకేలకు సౌరకాంతులతో మెరిసిపోయింది. జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ వెట్రిసెల్వి చొరవ తీసుకుని రూ. 12.5 లక్షలతో సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయించారు. 23 గిరిజన ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లభించడంతో, గ్రామస్తులు కలెక్టరేట్‌కు విచ్చేసి జేసీ ఎం.జె. అభిషేక్ గౌడ, విద్యుత్ శాఖ అధికారులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.


