News February 1, 2026

ప.గో: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. పార్శిల్ ఓపెన్ చేయగానే కస్టమర్ షాక్!

image

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో భద్రత ప్రశ్నార్థకమవుతోంది. భీమవరం జంక్షన్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌కు చెందిన వాణి అనే మహిళ ఓ డెలివరీ సైట్‌లో టిఫిన్ ఆర్డర్ చేయగా.. పార్శిల్‌లో ఆహారంతో పాటు కరెంట్ ప్లగ్ రావడంతో ఆమె నివ్వెరపోయారు. వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. హోటళ్లలో నాణ్యత, పర్యవేక్షణ లోపంపై జనం మండిపడుతున్నారు.

Similar News

News February 6, 2026

ప్రేమ-పాశం: తప్పు ఎవరిది..? శిక్ష ఎవరికి..?

image

ఈ మధ్య భార్యలు/ వారి ప్రియుళ్ల చేతిలో భర్తల చావు ఘటనలు చాలా వింటున్నాం. వీటిలో తప్పు.. పెళ్లి తర్వాతా గత రిలేషన్‌లో ఉండే అమ్మాయిలదా? లవ్ మ్యాటర్ చెప్పినా బలవంతంగా మరొకరితో వివాహం చేస్తున్న పెద్దలదా? ప్రేమ పెళ్లితో పరువు పోతుందనే పేరెంట్స్.. మన అమ్మాయి వల్లే అల్లుడు చనిపోతే పరువు పోదా? ఇక Love Birds.. ప్రేమ తప్పదంటే త్యాగాన్నైనా కోరుతుంది. అది ప్రాణత్యాగం మాత్రం కాదు.. అవతలి ప్రాణం అస్సలే కాదు.

News February 6, 2026

నెల్లూరులో ఆ రైతు ఐడియా అదుర్స్..!

image

నెల్లూరు జిల్లాలో వరి కోతకు వస్తోంది. చాలా చోట్ల వడ్ల గింజలను పిట్టలను తినేస్తున్నాయి. రైతులకు నష్టం జరుగుతోంది. ఈక్రమంలో సంగం మండలం అనసూయ నగర్‌కు చెందిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించారు. ఛార్జింగ్‌తో పనిచేసే మైక్ సెట్ పొలాల్లో ఏర్పాటు చేశారు. అందులో నుంచి శబ్దాలు రావడంతో పక్షులు అటు వైపు రావడం లేదు. ఓసారి ఛార్జింగ్ పెట్టి పొలాల్లో పెడితే సాయంత్రం వరకు పనిచేస్తోంది.

News February 6, 2026

GWL: ఉచిత ఫౌండేషన్ కోర్సు శిక్షణ గడువు పొడిగింపు

image

MBNR ఎస్సీ స్టడీ సర్కిల్లో స్టేట్ సర్వీసెస్, బ్యాంకింగ్, RRB ఉద్యోగాలకు ఇచ్చే 5 నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సు శిక్షణకు నిరుద్యోగుల నుంచి స్వీకరించే దరఖాస్తుల గడువును ఈనెల 22 వరకు పొడిగించినట్లు గద్వాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నుషిత శుక్రవారం తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారీటీ గ్రాడ్యుయేట్స్ tsstudycircle.com.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.