News December 29, 2024
ప.గో.: ఆ కేసును కొట్టివేయండి: మంత్రి

ఏలూరు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ.. మంత్రి నిమ్మల రామానాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హాజరు నుంచి మినహాయింపుతో పాటు కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 2022లో పాలకొల్లులో టిడ్కో ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వడంలేదంటూ నిమ్మల నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News February 27, 2026
భీమవరం: ఆహార భద్రతపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆహార భద్రత, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పాలు, నెయ్యి, వెన్న వంటి పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానం, నమూనాల ల్యాబ్ పరీక్షలపై దిశానిర్దేశం చేశారు.
News February 27, 2026
కలెక్టరుకు చాక్‌పీస్ మైక్రోఆర్ట్ బహూకరణ

పెరవలి మండలం తీపర్రుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కోడూరి రాఘవేంద్ర బాబు తన ప్రతిభతో కలెక్టరును ఆకట్టుకున్నారు. చాక్‌పీస్‌పై కలెక్టర్ చదలవాడ నాగరాణి పేరును అద్భుతంగా చెక్కి, శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమెకు అందజేశారు. ఈ కళాఖండాన్ని చూసి విస్మయం చెందిన కలెక్టర్.. రాఘవేంద్ర బాబును ప్రత్యేకంగా అభినందించారు. తన పేరును ఇంత సూక్ష్మంగా, కళాత్మకంగా చెక్కడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
News February 27, 2026
ఉండి: RRR ను పరామర్శించిన సినీనటుడు మోహన్‌బాబు

క్రీడా పోటీల్లో గాయపడి, ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజును ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు శుక్రవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోహన్ బాబు, రఘురామ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


