News February 3, 2025

ప.గో: ఇంటర్ యువతిపై లెక్చరర్ అత్యాచారం

image

ఇంటర్ అమ్మాయిపై లెక్చరర్ అత్యాచారం చేసిన ఘటన ఇది. కొవ్వూరుకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి రాజమండ్రిలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజీలో తిరుపతికి చెందిన వినయ్‌వర్ధన్ జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 28న ఆమెను విజయవాడ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతపురం, ఇతర ప్రాంతాల్లో తిరిగి భీమవరం వచ్చారు. తర్వాత అమ్మాయిని ఇంటికి పంపేయగా.. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News October 29, 2025

వికారాబాద్: నేడు జరగాల్సిన పరీక్ష నవంబర్ 1కి వాయిదా

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేడు జరగాల్సిన ఎస్ఏ-1 పరీక్ష నవంబరు ఒకటికి వాయిదా వేశామని డీఈవో రేణుకాదేవి ప్రకటించారు. పరీక్ష వాయిదా విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించారు. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు.

News October 29, 2025

ఎయిమ్స్ మదురైలో 84 పోస్టులు

image

<>ఎయిమ్స్ <<>>మదురై 84 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MD, MS, DM, M.Ch, PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 58ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్ఠ వయసు 50ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://aiimsmadurai.edu.in/

News October 29, 2025

రంగు చెప్పే ఆరోగ్య రహస్యం!

image

జీవనశైలి కారణంగా సంతానలేమి సమస్య పెరుగుతోంది. ఈక్రమంలో పురుషులు తమ ఆరోగ్య సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీర్యం రంగును చెక్ చేసుకోవాలంటున్నారు. ఆకుపచ్చ రంగు ఇన్‌ఫెక్షన్ (STIs కూడా)కు సూచన కావొచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పసుపు రంగు యూరిన్ కలవడం లేదా సప్లిమెంట్ల ప్రభావమై ఉండొచ్చు. రెడ్ కలర్ రక్తానికి సంకేతం (వైద్య పరీక్ష అవసరం). తెలుపు/బూడిద రంగు హెల్తీ.