News January 15, 2026

ప.గో: ఈ కోడికి క్రేజ్ మామూలుగా లేదుగా..!

image

గోదావరి జిల్లాలో సంక్రాంతి బరుల్లో ‘కోజా’కు భలే గిరాకీ ఏర్పడింది. చిన్ననాటి నుంచి ప్రత్యేక పౌష్టికాహారంతో పెంచడంతో.. ఈ మాంసానికి ప్రియుల నుంచి విశేష డిమాండ్‌ ఉంది. బరువును బట్టి వేల రూపాయలు పలికే ఈ కోజాలను పందెం విజేతలు విక్రయిస్తుండగా.. మరికొందరు ప్రముఖులకు, అధికారులకు విందు కోసం కానుకగా పంపిస్తున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పుంజులకు క్రేజ్ తగ్గకపోవడం విశేషం.

Similar News

News February 21, 2026

23 నుంచి ‘ప్రజావాణి’ పునఃప్రారంభం

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో యథావిధిగా వినతుల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు, దరఖాస్తుదారులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను సమర్పించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

News February 21, 2026

కేంద్ర మంత్రి పర్యటన.. గద్వాల కలెక్టర్ ఆదేశాలు

image

కేంద్ర మంత్రి హెచ్.డి.కుమారస్వామి ఈనెల 23న అలంపూర్‌లోని ఆలయాలను సందర్శించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం గద్వాల కలెక్టరేట్‌లో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అలంపూర్ హెలిప్యాడ్ నుంచి ఆలయాలకు వెళ్లే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

News February 21, 2026

బుచ్చిలో రూ.కోట్లలో క్రికెట్ బెట్టింగ్..?

image

బుచ్చి క్రికెట్ బెట్టింగ్‌కు అడ్డాగా మారింది. నిత్యం కోట్లలో బెట్టింగ్ సాగుతుంది. నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు వద్ద పట్టుబడ్డ నగదే ఇందుకు సాక్ష్యం. రాదే ఎక్స్‌ఛేంజ్ యాప్ తరహాలో ఎన్నో యాప్‌ల ద్వారా యువతే లక్ష్యంగా నిత్యం బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. యువత బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఎస్పీ దృష్టి పెడితే ఎందరో బెట్టింగ్ రాయుళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం.