News January 21, 2026
ప.గో: ఉదయాన్నే ఫోన్ కాల్స్.. రెవెన్యూ ఉద్యోగుల ఉక్కిరిబిక్కిరి!

ఉమ్మడి ప.గో జిల్లా రెవెన్యూ అధికారులు టెలికాన్ఫరెన్స్ మీటింగ్‌లతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో నిమగ్నమైన తహసీల్దార్లకు ఉదయం 8 నుంచే ఆర్‌డీఓలు, జేసీల నుంచి సమీక్షా పిలుపులు వస్తున్నాయి. దీంతో వారు ప్రయాణంలోనూ ఫోన్లతోనే గడపాల్సి రావడంతో క్షేత్రస్థాయిలో పర్యటనలు ఆలస్యమవుతున్నాయి. పని ఒత్తిడి పెరిగి ప్రజా సమస్యల పరిష్కారం కుంటుపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News February 12, 2026
సీఎంఆర్ రైసును మిల్లర్లు సకాలంలో ఇవ్వాలి: అదనపు కలెక్టర్

కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను రైస్ మిల్లర్లు సకాలంలో ఎఫ్‌సీఐకి అందజేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి సూచించారు. గురువారం డిఫాల్ట్ రైస్ మిల్లర్లు, టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి చెల్లించే పెనాల్టీలను త్వరగా చెల్లించాలన్నారు.టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ రావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వాజిద్ అలీ, పాల్గొన్నారు.
News February 12, 2026
ఆదిలాబాద్: కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే వారికి సూచనలు

ఆదిలాబాద్‌లో రేపు జరగనున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టీటీడీసీ పరిసరాల్లో 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. విజయోత్సవ ర్యాలీలు, టపాకాయలు, డీజేలకు అనుమతి లేదన్నారు. ఏజెంట్లు, అభ్యర్థులు సెల్‌ఫోన్లు, ఇంకు పెన్నులు తీసుకురావద్దని సూచించారు.
News February 12, 2026
ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఉపాధి హామీ పనులు (జి రామ్ జి పనులు) వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీరాజ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ను కలెక్టర్ నిర్వహించారు. మార్చి నాటికి నిర్దేశించిన లక్ష్యాలు విధిగా పూర్తి కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనులు పూర్తి చేయుటకు ప్రతి రోజు, ప్రతి వారం వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని ఆదేశించారు.


