News January 3, 2025
ప.గో: ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై గ్రామసభలు

ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టు ప్రక్కల ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఈ సమావేశాలు ఉంటాయన్నారు. ఆయా మండలాలకు సంబంధించి కొల్లేరు పరిధిలోని ప్రజలు గ్రామసభలకు హాజరై అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.
Similar News
News April 23, 2025
పెరవలి – మార్టేరు రోడ్డులో రాకపోకలు బంద్

పెరవలి – మార్టేరు రోడ్డులో నెగ్గిపూడి నుంచి పెనుగొండ వరకు R&B రహదారి పనులు జరుగుతున్నాయి. ఈనెల 25 నుంచి జూన్ 25 వరకు నిలిపివేయనున్నట్లు R&B AE ప్రసాద్ తెలిపారు. నెగ్గిపూడిలో రహదారి నిర్మాణం, పెనుగొండలో వంతెన పనులు జరుగుతున్నాయన్నారు. మార్టేరు టు రావులపాలెం వెళ్లే వాహనాలను మార్టేరు,ఆచంట, సిద్ధాంత మీదుగా, మార్టేరు – తణుకుకు వెళ్లే వాహనాలు మార్టేరు, ఆలుమూరు, ఇరగవరం మీదుగా మళ్లించనున్నారు.
News April 23, 2025
ప.గో: అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: కలెక్టర్

భవ్య భీమవరం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మంగళవారం కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ భవ్య భీమవరం సుందరీకరణ, మౌలిక వసతులు అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల పురోగతి, ఇంకా చేపట్టవలసిన పనులపై మున్సిపల్ అధికారులు,దాతలతో సమావేశమై సమీక్షించారు. కాస్మో పోలిటన్ క్లబ్ వద్ద వంశీకృష్ణ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు.
News April 22, 2025
ఇబ్బందులు ఉంటే రైతులు తెలపాలి: జేసీ

ఉండి మండలం యండగండి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రైతు సేవ కేంద్రం ద్వారా కొనుగోలు సక్రమంగా జరుగుతుందా, అధికారులు మీకు సహకరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలపాలన్నారు. రైతులతో కలిసి తేమ శాతం పరిశీలించారు.