News March 20, 2024
ప.గో: ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు యాప్

రాబోయే ఎన్నికల్లో అక్రమాలకు తావు లేకుండా ఓటింగ్ జరగాలని స్వీప్ నోడల్ ఆఫీసర్ తూతిక విశ్వనాథ్ అన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సి.విజిల్ యాప్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాల్లోనే అధికారుల నుంచి స్పందన వస్తుందని అన్నారు. జిల్లా యంత్రంగం ఈ యాప్‌లో వచ్చిన ఫిర్యాదులకు సకాలంలో స్పందించి పరిష్కారం చూపుతారన్నారు.
Similar News
News February 3, 2026
ప.గో: తల.. మొండెం వేరు వేరుగా

ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడులో నమ్మి రాంబాబు(22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న రాంబాబు మృతదేహం మంగళవారం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. మృతదేహం పక్కనే చీర వేలాడుతుండగా.. మొండెం నుంచి తల వేరుపడి ఉంది. సుమారు ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
News February 3, 2026
పన్నులను డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించాలి: కలెక్టర్

ఇంటి, కుళాయి పన్నులను డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించాలని కలెక్టర్ నాగరాణి మంగళవారం సూచించారు. ఆకివీడు మండలం పెద్దకారులో పైలెట్ ప్రాజెక్టుగా పన్నుల వసూలు జరుగుతోందని తెలిపారు. భూమి ధరలకు అనుగుణంగా పన్నులు పెరిగాయని, గ్రామంలో గతంలో రూ. 4 లక్షలుగా ఉన్న పన్నులు రూ. 15 లక్షలకు చేరాయని వివరించారు. ఇప్పటివరకు రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News February 3, 2026
భీమవరం: బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు.!

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు రూ.10వేల జరిమానా, బాధితురాలికి రూ.5.80 లక్షల పరిహారం చెల్లించాలని భీమవరం ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ సోమవారం తుది తీర్పు వెల్లడించారు. బాలిక దసరా సెలవులకు ఉండి రాగా మేనత్త కుమారుడు నాగాంజనేయులు పలుమార్లు లైంగికదాడులకు పాల్పడ్డాడు. వార్డెన్‌కు తెలపడంతో వార్డెన్ ఉండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


