News April 7, 2024
ప.గో.: ఎన్నికల సిత్రం.. గారెలు, బజ్జీలు వేసిన MLA అభ్యర్థి

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని కొవ్వూరు కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని మలకపల్లిలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన ఓ టిఫిన్ సెంటర్‌లో గారెలు, బజ్జీలు వేశారు.
Similar News
News October 3, 2025
తణుకు: సురేశ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. హత్యగా కేసుగా మార్పు

అనుమానాస్పద స్థితిలో అదృశ్యమై హత్యకు గురైన మడుగుల సురేష్ మృతదేహానికి పోస్టుమార్టం శుక్రవారం పూర్తి చేశారు. తణుకులో న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుతో పాటు మరో నలుగురు చేతిలో హతమైనట్లుగా పోలీసులు భావిస్తున్న సురేష్ మృతదేహాన్ని సఖినేటిపల్లి గోదావరి తీరంలో గురువారం గుర్తించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 3, 2025
అత్యంత కిరాతకంగా చంపి… గోనె సంచిలో కుక్కి..!

తణుకులో అదృశ్యమై తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శవమై తేలిన మడుగుల సురేశ్ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుతో పాటు మరో నలుగురు సురేశ్‌ను హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి గోనె సంచిలో కుక్కి గోదావరిలో పడవేసినట్లు తెలుస్తోంది. న్యాయవాది సోదరుడి కారులో మృతదేహాన్ని తరలించారనే అనుమానంతో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News October 3, 2025
జిల్లాలో నేటి నుంచి 3వ పేజ్ రీ సర్వే: కలెక్టర్

జిల్లాలో నేటి నుంచి 3వ దశ రీ-సర్వే జిల్లాలో మొదలవుతుందని కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 221 గ్రామాలలో రీ-సర్వే పూర్తి చేశామని, మరో 22 గ్రామాలలో జరుగుతోందని అన్నారు. రైతులందరూ రీ-సర్వేకు సహకరించాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది మీ భూమి సర్వే ఎప్పుడు చేస్తారో ముందుగా నోటీస్ ద్వారా తెలియజేస్తారని, ఆ సమయంలో రైతులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.