News December 24, 2024

ప.గో: ఎమ్మెల్సీని అభినందించిన సీఎం చంద్రబాబు

image

తూర్పు పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం మర్యాదపూర్వక కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గోపి మూర్తిని అభినందించారు. అనంతరం ఉపాధ్యాయ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 24, 2024

పాలకోడేరులో ఇళ్లు తొలగిస్తున్నారంటూ ఆందోళన

image

పేదల ఇళ్లను తొలగించాలని చూస్తున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కుట్రలను తిప్పికొట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం పాలకోడేరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఏఎస్ఆర్ నగర్‌లో 140 మంది దశాబ్దాల క్రితం ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారి ఇళ్లను తొలగించాలని ఎమ్మెల్యే కుట్రలు చేయడం తగునా అని జక్కంశెట్టి ప్రశ్నించారు.

News December 24, 2024

ఉండి: పర్లయ్యను చంపితే అనుమానం రాదని..!

image

తులసిని హత్య కేసులో ఇరికించడానికే శ్రీధర్ వర్మ వ్యూహాత్మకంగా వ్యహరించినట్లు తెలుస్తోంది. కాళ్ల(M) గాంధీనగర్‌కు చెందిన <<14958481>>పర్లయ్య<<>> మద్యానికి బానిసై కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఎక్కడ ఎవరు తిండి పెడితే అక్కడే పర్లయ్య పనిచేసి అక్కడే నిద్రిస్తుంటాడు. శ్రీధర్ మొదటి భార్యది కూడా పర్లయ్య ఊరే కావడంతో శ్రీధర్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో పర్లయ్యను చంపితే ఎవరికీ అనుమానం రాదని తన ప్లాన్ అమలు చేశాడు.

News December 24, 2024

ఉండి: ఎర్ర కారులో వచ్చిందెవరు..?

image

డెడ్‌బాడీ పార్శిల్ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. ఇందులో <<14964154>>శ్రీధర్ వర్మనే <<>>కీలకమని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తులసి ఇంటికి వచ్చిన డెడ్‌బాడీ <<14958481>>పర్లయ్యది<<>> అని తేల్చారు. ఎర్ర కారులో వచ్చిన మహిళ ఆటో డ్రైవర్‌కు పార్శిల్ ఇచ్చి తులసికి ఇవ్వాలని చెప్పి వెళ్లిపోయింది. అసలు ఆమెకు శ్రీధర్‌కు లింక్ ఏంటి? హత్య తర్వాత ఇద్దరూ కలిసి కారులో పారిపోయారా? అనేది తెలియాలి.