News July 13, 2024
ప.గో, ఏలూరు జిల్లాల ఎస్పీలు బదిలీ

ప.గో, ఏలూరు జిల్లాల ఎస్పీలు అజిత వేజెండ్ల, మేరీ ప్రశాంతి బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న ఆద్నాన్ నయీం అస్మీ పశ్చిమ గోదావరి జిల్లాకు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ASPగా ఉన్న ప్రతాప్ శివకిషోర్ ఏలూరు ఎస్పీగా నియమితులయ్యారు. కాగా.. ప.గో ఎస్పీ అజిత వేజెండ్ల విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్-1గా వెళ్తున్నారు.
Similar News
News February 19, 2026
నరసాపురం: బలవన్మరణానికి పాల్పడిన బాలిక

నరసాపురం పట్టణంలో బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసులు వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ బాలిక ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం కుటుంబీకులు ఆసుపత్రికి తరలించినా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి చెప్పారు. దీనిపై టౌన్ ఎస్ఐ జయలక్ష్మి కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2026
ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి బిఎల్ఓలను ఆదేశించారు. బుధవారం భీమవరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల నమోదు, మార్పుల క్లైమ్ల పరిష్కారంపై సమీక్షించారు. ముఖ్యంగా యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక ప్రచారం చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పారదర్శకంగా పనులు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News February 18, 2026
పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పది, ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. జిల్లాలోని 132 కేంద్రాలలో 24,166 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.


