News June 22, 2024
ప.గో, ఏలూరు జిల్లాల కొత్త కలెక్టర్లు వీరే

➤ ప.గో కలెక్టర్ సుమిత్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో టెక్నికల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్‌గా ఉన్న సి.నాగారాణి కలెక్టర్‌గా రానున్నారు. సుమిత్‌ను చిత్తూరు కలెక్టర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
➤ ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా ఉన్న వెట్రీ సెల్వీ ఏలూరు కలెక్టర్‌గా రానున్నారు.
Similar News
News December 21, 2025
కాళ్ల: చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ సి.నాగరాణి తల్లిదండ్రులకు సూచించారు. ఆదివారం పెదఅమీరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించి, చిన్నారులకు చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గీతాబాయ్, సర్పంచి డొక్కు సోమేశ్వరరావు పాల్గొన్నారు.
News December 21, 2025
ఈనెల 22న వీరవాసరంలో జిల్లాస్థాయి సైన్ ఫెయిర్

ఈ నెల 22న వీరవాసరం ఎంఆర్‌కె జడ్పీ హైస్కూల్‌లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు డీఈవో నారాయణ తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్లో పాఠశాలల నుంచి మండల స్థాయికి ఎంపికైన, మండల స్థాయిలో ఉత్తమంగా ఎంపికైన సైన్స్ ప్రదర్శనలు ప్రదర్శిస్తారన్నారు. జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌కి ఎంపికైన ఎగ్జిబిట్స్ ముందు రోజే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.
News December 21, 2025
తాడేపల్లిగూడెం: మోపెడ్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

పెదతాడేపల్లి సమీపంలోని వెల్లమిల్లి స్టేజ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిపూడి పెద్దిరాజు మృతి చెందారు. వెల్లమిల్లిలో పని ముగించుకుని కొమ్ముగూడెం వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన లారీ వీరి మోపెడ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పెద్దిరాజు గాయాలతో చికిత్స పొందుతూ కన్నుమూయగా, మోపెడ్ నడుపుతున్న చెల్లయ్య తలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


